ఆచార్య సినిమాలో చిరంజీవి కి జోడిగా కాజల్ అగర్వాల్ నటించింది. కాజల్ అగర్వాల్ ఆచార్య లుక్ లో లంగాఓణిలో ట్రెడిషనల్ గా అదిరిపోయింది. ఇక ఇప్పుడు ఆచార్య ప్రమోషన్స్ మొదలైనా కాజల్ అగర్వాల్ రాలేని పరిస్థితి. ఎందుకంటే కాజల్ ప్రెగ్నెంట్. నెలలు నిండుతుండడంతో కాజల్ ఆచార్య ప్రమోషన్స్ కి రాకపోవచ్చు. ఇప్పుడు కాజల్ పేరు ప్రత్యేకించి ప్రస్తావించడం వెనుక కారణం ఏమిటి అంటే.. కాజల్ అగర్వాల్ ఆచార్య లో మెయిన్ హీరోయిన్. కానీ ఆచార్య ట్రైలర్ లో సింగిల్ షాట్ లో కూడా కాజల్ ని కట్ చెయ్యలేదు. కేవలం సిద్ధ గా - నీలాంబరిగా గెస్ట్ రోల్స్ చేస్తున్న పూజ హెగ్డే ని, రామ్ చరణ్ ని హైలైట్ చేసారు కానీ.. కాజల్ ని చూపించలేదు.
కనీసం ఓ సింగిల్ షాట్ లో అయినా కాజల్ ని చూపిస్తే బావుండేది అనేది ఆమె అభిమానుల అభిప్రాయం. వాదన కాదు మెయిన్ హీరోయిన్ ని పక్కనబెట్టి సైడ్ హీరోయిన్ ని హైప్ చెయ్యడం ఎంతవరకు కరెక్టో మేకర్స్ కే తెలియాలి. కాజల్ - చిరు కాంబో సీన్ పెట్టినట్లయితే ట్రైలర్ లో అదిరిపోయేది.. కానీ కాజల్ ని చూపించలేదు. టీజర్ లో పర్ఫెక్ట్ గానే చూపించారు కానీ ట్రైలర్ విషయానికి వచ్చేసరికి కాజల్ ని ఎందుకు కట్ చేసారో తెలియక ఆమె ఫాన్స్ తికమకపడడమే కాదు.. దర్శకుడు కొరటాలపై దుమ్మెత్తి పోస్తున్నారు.