నేడు ముంబై లో బాలీవుడ్ క్యూట్ కపుల్ రణబీర్ కపూర్ - అలియా భట్ లు పెళ్లి పీటలెక్కడానికి రెడీగా ఉన్నారు. మరికొద్ది గంటల్లో రణబీర్-అలియా పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈ పెళ్ళికి ఫ్యామిలీ మెంబెర్స్ ఇంకా కొద్దిమంది అతిధులు తప్ప ఎక్కువ సంఖ్యలో పెళ్ళికి హాజరవడం లేదు. అయినప్పటికీ పెళ్లి లో జరగాల్సిన వేడుకలు, ముచ్చట్లు అన్ని అందంగా జరిపించేస్తున్నారు ఇరు ఫ్యామిలీ మెంబెర్స్. గత రాత్రి మెహిందీ ఫంక్షన్ ని వేడుకగా చేసిన ఈ ఫామిలీస్ ఇక పెళ్లి తంతు మొదలు పెట్టారు. బాంద్రాలోని వాస్తు పార్ట్మెంట్ లోనే అలియా భట్-రణబీర్ కపూర్ ల పెళ్లి ఈ రోజు మద్యాన్నం 2 గంటలకు జరగబోతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే పెళ్ళికి ముందే రణబీర్ కపూర్ తనకు కాబోయే భార్యకి ఎనిమిది వజ్రాలు పొదిగిన ఖరీదైన వెడ్డింగ్ బ్యాండ్ ని గిఫ్ట్ గా ఇచ్చారట. కపూర్ ఇంటి కుటుంబానికి 8 లక్కీ నంబర్ అట. సో అలా ఎనిమిది వజ్రాలు పొదిగిన ఆ బ్యాండ్ ని రణబీర్ అలియా కి ప్రెజెంట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఆ గిఫ్ట్ ని రణబీర్ ప్రత్యేకంగా తయారు చేయించారని, అలియా పెళ్ళిలో ఆ బ్యాండ్ ధరిస్తుంది అంటున్నారు. ఇక మెహిందీ వేడుక తర్వాత తమ కోడలు బెస్ట్ అంటూ రణబీర్ తల్లి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక పెళ్లిని చాలా సింపుల్ గా చేసుకుంటున్న అలియా భట్-రణబీర్ కపూర్ ల జంట రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా చేసుకోబోతున్నారట. అది కూడా ముంబై లోనేనట. ముంబైలోని తాజ్ హోటల్ ని ముందుగా ఈ రిసెప్షన్ కోసం అనుకున్నా.. భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పుడు ఈ వేదిక వాస్తు అపార్ట్మెంట్ కే మారినట్లుగా తెలుస్తుంది. ఈ నెల 16 న అంటే శనివారం సాయంత్రం అలియా భట్-రణబీర్ ల వెడ్డింగ్ రిసెప్షన్ జరగబోతుంది అని.. ఈ రిసెప్షన్ కోసం బాలీవుడ్ సెలబ్రిటీస్ అలాగే పొలిటికల్ లీడర్స్ కూడా హాజరవుతారని తెలుస్తుంది.