Advertisementt

ప్రభాస్ సలార్ టీజర్ ఎప్పుడంటే..

Thu 14th Apr 2022 02:49 PM
salaar,prabhas,salaar teaser,prashanth neel  ప్రభాస్ సలార్ టీజర్ ఎప్పుడంటే..
SALAAR teaser will be out in May last week ప్రభాస్ సలార్ టీజర్ ఎప్పుడంటే..
Advertisement
Ads by CJ

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడలో తెరకెక్కి పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయిన కెజిఎఫ్ 2 కి ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ రావడమే కాదు, క్రిటిక్స్ కూడా మిక్స్డ్ రివ్యూస్ ఇస్తున్నారు. అయితే కెజిఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ తో పాటుగా ఆయన తదుపరి మూవీ సలార్ నుండి టీజర్ రిలీజ్ ఉంటుంది అని ప్రచారం జరిగింది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న సలార్ మూవీ టీజర్ చాప్టర్ 2 థియేటర్స్ లోనే రిలీజ్ చేయబోతున్నారని అన్నప్పటికీ.. టీం ఖండించింది.

అయితే ప్రభాస్ సలార్ టీజర్ రెడీ అవుతుంది అని, అది కూడా మరొక్క నెలలో అంటే మే చివరి వారంలోనే సలార్ టీజర్ వదలబోతున్నట్టుగా అప్ డేట్ వచ్చేసింది. యశ్ హీరోయిజాన్ని ప్రపంచానికి చూపించిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని సలార్ లో ఏ విధంగా ఎలివేట్ చేస్తారో అనే ఆసక్తితో ప్రభాస్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సలార్ నుండి లీకైన ప్రభాస్ పిక్స్ చూస్తే మరో కెజిఎఫ్ అనేలా ఉన్నాయి. సో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సలార్ టీజర్ కోసం వెయిటింగ్ అంటూ ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టేసారు.

SALAAR teaser will be out in May last week:

Prabhas Salaar teaser will be out in May-2022

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ