ఇప్పుడు పరభాషా చిత్రాలు హిందీలో సత్తా చాటటడమే కాదు అక్కడి స్టార్ హీరోలకి షాకిచ్చేలా కలెక్షన్స్ కొల్లగొడుతున్నాయి. గతంలో బాహుబలి, కెజిఎఫ్ ఇప్పుడు పుష్ప, ట్రిపుల్ ఆర్ మూవీ, కెజిఎఫ్ 2 ఇలా హిందీ బాక్సాఫీసు దుమ్ముదులుపుతున్నాయి. అయితే అక్కడ హీరోలే కాదు.. మీడియా కూడా పరభాషా చిత్రాలపై విషం చిమ్ముతున్నాయి. పుష్ప, ట్రిపుల్ ఆర్, నిన్న రిలీజ్ అయిన కెజిఎఫ్ చిత్రాలు విడుదలకు ముందు ప్రమోషన్స్ లోనే మీడియా పక్షపాతం చూపించగా.. సినిమాలు విడుదలయ్యాక ఆ సినిమాల నెగెటివ్ పాయింట్స్ ని బయటికి తీసి మరీ పబ్లిష్ చేస్తున్నాయి.
ట్రిపుల్ ఆర్ విషయంలో రాజమౌళి ప్లానింగ్ తో వ్యవహరించారు కాబట్టి సరిపోయింది. ఇక కెజిఎఫ్ 2 రిలీజ్ కి ముందే హిందీ మీడియా లో నెగెటివిటి కనిపించగా.. నిన్న సినిమా రిలీజ్ అయ్యాక నెగెటివ్ రివ్యూలతో ప్లాప్ టాక్ స్ప్రెడ్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. కొన్ని హిందీ వెబ్ సైట్స్ లో మాత్రమే కెజిఎఫ్ కి హిట్ రివ్యూస్ రాగా.. మిగతా వాటిలో కెజిఎఫ్ మైనస్ పాయింట్స్ తో హైలెట్ చేసారు. కెజిఎఫ్ 2 పై ఇంతగా విషం కక్కడం మేకర్స్ కి బాధ కలిగించినా కంటెంట్ బాగా ఉండి ప్రేక్షకులు ఆధరిస్తే.. కలెక్షన్స్ ని ఆపడం మీడియా తరం కూడా కాదు అనేది పుష్ప రుజువు చెయ్యగా.. ఇప్పుడు కెజిఎఫ్ 2 కూడా అదే బాటలో కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది.