రకుల్ ప్రీత్ ఇప్పుడు టాలీవుడ్ కి ఆమడదూరంలో ఉంది. కారణం ఆమెకి వరస ప్లాప్స్ తగలడంతో టాలీవుడ్ ఆమెని లైట్ తీసుకుంది. సోషల్ మీడియాలో ఎంతగా అరాచకమైన గ్లామర్ తో ఫొటోస్ షేర్ చేసినా రకుల్ ప్రీత్ కి తెలుగు నుండి ఒక్కటంటే ఒక్క ఆఫర్ కూడా తగలడం లేదు. ఈమధ్యన మరీ చిక్కిపోయి సన్నగా మోహంలో కళ కోల్పోయి కనబడుతుంది రకుల్. ఇక బాలీవుడ్ లో రకుల్ చేతిలో సినిమాలు ఉన్నా.. అక్కడ కూడా సక్సెస్ దొరక్క కిందా మీదా పడుతుంది. స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తుంది. కానీ హిట్ మాత్రం దక్కడం లేదు.
అయితే ఇప్పుడు రకుల్ కి కోలీవుడ్ నుండి ఓ అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తుంది. అది అజిత్ కుమార్ AK61 లో రకుల్ ని హీరోయిన్ గా సంప్రదిస్తున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హెచ్ వినోద్ తో వలిమై తర్వాత బోని కపూర్ నిర్మాతగా మరోసారి వినోద్ దర్శకత్వంలో నటిస్తున్న అజిత్ కి జోడిగా రకుల్ ని అనుకుంటున్నారట. ఇప్పటికే అజిత్ - వినోద్ ల షూటింగ్ హైదరాబాద్ లో మొదలైపోయింది. అజిత్ ప్రెజెంట్ హైదరాబాద్ లోనే ఉన్నారు. ఈ సినిమా కోసమే రకుల్ కి అజిత్ ఛాన్స్ ఇచ్చారని టాక్ నడుస్తుంది.