ప్రభాస్ నాలుగైదు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగా వున్నారు.. ప్రస్తుతం ప్రాజెక్ట్ కే షూటింగ్ లో పాల్గొంటున్న ప్రభాస్ ఓం రౌత్ కలిసి ఆదిపురుష్ షూటింగ్ ని ఎప్పుడో కంప్లీట్ చేసేసారు. ఇక సలార్ షూటింగ్ కూడా మే ఎండ్ నుండి కొత్త షెడ్యూల్ కి వెళ్ళబోతున్నారు. తర్వాత మారుతి ప్రాజెక్ట్ అలాగే సందీప్ వంగా స్పిరిట్ మూవీ షూటింగ్స్ చేస్తారని తెలుస్తుంది. రీసెంట్ గా ప్రభాస్ ఓ నేషనల్ ఇండియా కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో కెజిఎఫ్ 2, ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియా మూవీస్ సక్సెస్ గురించి మాట్లాడిన ప్రభాస్.. పెళ్లి విషయంపై క్లారిటీ కూడా ఇచ్చారు.
అంతేకాకుండా ప్రభాస్ ఈ ఇంటర్వ్యూ లోనే తన లైనప్ లో ఇంకా ఏకంగా 8 నుంచి 9 సినిమాలు ఉన్నాయని చెప్పారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈమధ్యన నిర్వీరంగా షూటింగ్స్ చేస్తూ పలు ప్రాజెక్ట్స్ ని ఒప్పేసుకుని అధికారికంగా ప్రకటిస్తున్న ప్రభాస్ చేతిలో ఏడెనిమిది ప్రాజెక్ట్స్ ఉంటే ప్రభాస్ ఫాన్స్ కి పండగే. ఏడాదికి ఓ సినిమా లెక్కన ఫాన్స్ కి ట్రీట్ ల మీద ట్రీట్ లు ఉండడం మాత్రం ఖాయం.