ఎమ్యెల్యే రోజా ఇప్పుడు ఏపీ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చెయ్యడంతో సినిమాలకి, కామెడీ షో జబర్దస్త్ కి, ఈటివి స్పెషల్ షోస్ కి బై బై చెప్పేసింది. కన్నీటితో జెడ్జ్ గా జబర్దస్త్ నుండి వెళ్లిపోయిన ప్రోమో వైరల్ అయ్యింది. అయితే ఇప్పుడు జబర్దస్త్ జెడ్జ్ గా రోజా ప్లేస్ కి ఎవరు వస్తారో అనేదానిపై క్యూరియాసిటీ మొదలయ్యింది. ఆమనీ, ఇంద్రజ గెస్ట్ జేడ్జ్ గా కనబడుతున్నారు. అటు మనో కూడా చక్కగా రావడం లేదు, బ్రేకులు మీద బ్రేకులు తీసుకుంటున్నారు.
ఇక రోజా ప్లేస్ ని ఎవరు భర్తీ చేసినా రోజా అంత ఇమేజ్ అయితే జబర్దస్త్ కి మళ్ళీ రాదు. రోజా గ్లామర్ వేరు, రోజా క్రేజ్ వేరు. ఆమె చేసే పంచ్ లు కుండ్ స్పెషల్ వేరు. అలాంటి రోజా లేని లోటు అయితే జబర్దస్త్ కి స్పష్టంగా కనబడుతుంది. అయితే రోజాలా జబర్దస్త్ కి ఇకపై పర్మినెంట్ జెడ్జ్ ఉండకపోవచ్చని, ఇక జబర్దస్త్ షో గెటాన్ అవడం కూడా కష్టమే ఎలాగూ కమెడియన్స్ లేరు అని కొంతమంది. ఆమనీ, ఇంద్రజ, లైలా వీళ్లంతా పర్మినేట్ గా కాదు వాళ్లంతా టెంపరరీ జెడ్జ్ లు మాత్రమే అంటున్నారు కొంతమంది.