బిగ్ బాస్ నాన్ స్టాప్ వాడి వేడిగా సాగుతుంది. ఈ నాన్ స్టాప్ సీజన్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ చాలామంది బోల్డ్ గా మాట్లాడెయ్యడమే కాదు.. గ్లామర్ షో కి ఎక్కడా తగ్గడం లేదు. అరియనా సరయు పై చేసిన బాడీ షేమింగ్ కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. తాజాగా బిందు మాధవి - యాంకర్ శివ పై అఖిల్ బ్యాచ్ చేసిన దుబ్బట్లో దడ దడ కామెంట్స్ కి నాగార్జున ఫైర్ అయ్యారు. అఖిల్ బ్యాచ్ లో అజయ్, ఆశు రెడ్డి అందరూ కూర్చుని బిందు - శివ లపై మీ అభిప్రాయం ఏమిటి అని అఖిల్ అడగ్గా దానికి అజయ్ దుబ్బట్లో దుప్పట్లో దడ దడ అని, ఆశు రెడ్డి దుప్పట్లో భీబత్సం అంటూ కామెంట్స్ చేసారు. అయితే గత రాత్రి నాగ్ ఎపిసోడ్ లో ఈ వారం అందరూ చెత్తగా ఆడారంటూ స్మూత్ గా మందలించారు.
ఇక స్టామినా ఉన్న అజయ్ గ్రూప్ లో పడి గేమ్ ఆడడం లేదంటూ అతన్ని కన్ఫెషన్ రూమ్ కి పిలవగా అజయ్ కాస్త భయంగానే వీలదు. దానితో నాగార్జున అజయ్ తో మనం ఏదైనా మట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మాట్లాడాలి. కొన్ని వాడకూడని పదాలు ఉంటాయి. వాటిని అస్సలు వాడకూడదు. అది వాళ్లకు తెలిస్తే ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసా అంటూ నాగార్జున అజయ్ దుప్పట్లో దడ దడ వీడియో ని చూపించి, నువ్వు మాట్లాడింది బయటికి ఎలా వెళ్లిందో తెలుసా.... మళ్ళీ ఇలాంటి కామెంట్స్ చేస్తే ఊరుకోను అంటూ స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇచ్చారు నాగ్. దానితో అజయ్ తప్పు చేశాను అంటూ నాగ్ ని క్షమాపణ కోరాడు.