Advertisementt

కాజల్ అగర్వాల్ గుడ్ న్యూస్ చెప్పేసింది

Tue 19th Apr 2022 04:58 PM
kajal agarwal,kajal agarwal gives birth to a baby boy,gautham kitchlu,kajal,nisha agrwal  కాజల్ అగర్వాల్ గుడ్ న్యూస్ చెప్పేసింది
Kajal Agarwal Blessed with a Baby Boy కాజల్ అగర్వాల్ గుడ్ న్యూస్ చెప్పేసింది
Advertisement
Ads by CJ

కాజల్ అగర్వాల్ ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెబుతుందా అని ఆమె ఫాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. మరోపక్క కాజల్ ఇచ్చే స్వీట్ గిఫ్ట్ కోసం ఆమె భర్త గౌతమ్ కిచ్లు కూడా వెయిటింగ్ లోనే ఉన్నారు. ఎందుకంటే కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ కాబట్టి. కాజల్ గత ఏడాది చివరిలో ప్రెగ్నెన్సీ కంఫర్మ్ అయ్యాక సినిమాలకి, షూటింగ్స్ కి దూరముగా ఉంది. ఆచార్య షూటింగ్ కంప్లీట్ చేసినా.. నాగార్జున ద ఘోస్ట్ నుండి పక్కకి తప్పుకుంది. 

తర్వాత ప్రెగ్నెన్సీ ని కంఫర్మ్ చేసిన కాజల్ ఎలాంటి తడబాటు, సిగ్గు పడకుండా బేబీ బంప్ ఫోటో షూట్స్ తో ఫాన్స్ కి కిక్ ఇస్తూనే ఉంది. అలాగే బాడీ షేమింగ్ పై ఎప్పటికప్పుడు మాట్లాడుతుండే కాజల్ అగర్వాల్ డెలివరీ టైం దగ్గరపడుతోంది అంటూ కాస్త ఎమోషనల్ అయ్యింది. ఇక నేడు ఆమె ఫాన్స్ కి, ఆమె భర్తకి గుడ్ న్యూస్ చెప్పేసింది. అదేమిటంటే కాజల్ అగర్వాల్ పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చినట్లుగా ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. కాజల్ అబ్బాయిని ప్రసవించింది, ఆమె క్షేమంగా ఉంది ఈ న్యూస్ మీతో పంచుకోవడనికి ఎంతో ఆనందంగా ఉంది అంటూ నిషా అగర్వాల్ కాజల్ కి బాబు పుట్టిన విషయం చెప్పింది.

Kajal Agarwal Blessed with a Baby Boy:

Kajal Agarwal gives birth to a Baby Boy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ