రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సక్సెస్ పార్టీలు తర్వాత ఆచార్య డబ్బింగ్ పనులు ఫినిష్ చేసేసి.. కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్న RC15 షూటింగ్ లో జాయిన్ అయ్యారు. శంకర్ - రామ్ చరణ్ కలయికలో మూడు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దిల్ రాజు భారీ బడ్జెట్ పెడుతున్నారు. RC 15 షూటింగ్ నిన్నటివరకు పంజాబ్ లోని అమృత్ సర్ లోని ఓ యూనివర్సిటీలో జరిగింది. ఈ షెడ్యూల్ లోనే రామ్ చరణ్ చేతిలోకి పుస్తకాలు వచ్చాయి. కియారా అద్వానీ - రామ్ చరణ్ లపై కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లోనే తెరకెక్కించారు శంకర్. అయితే భర్త రామ్ చరణ్ అమృత్ సర్ లో ఉండడంతో.. ఉపాసన కూడా అక్కడే ఉండి.. అక్కడి స్వర్ణ దేవాలయంలో పూజలు నిర్వహించింది.
ఇక RC15 అమృత్ సర్ షెడ్యూల్ కంప్లీట్ కావడంతో రామ్ చరణ్ భార్య ఉపాసనతో కలిసి హైదరాబాద్ కి వచ్చేసారు. ఇకపై ఆచార్య రిలీజ్ అయ్యేవరకు ఆచార్య టీంకి చరణ్ అందుబాటులోనే ఉండబోతున్నారు. ఎందుకంటే ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్, అలాగే ఆచార్య కొన్ని ఇంటర్వూస్ లో రామ్ చరణ్ పాల్గొనబోతున్నారు. ఇప్పటికే చరణ్ - కొరటాల కలయికలో ఓ ఇంటర్వ్యూ షూట్ జరగడం అది ఈ రోజు ఈవెనింగ్ పబ్లిష్ చెయ్యబోతున్నట్టుగా టీం ప్రకటించింది. ఇక ఆచార్య రిలీజ్ అయ్యేవరకు రామ్ చరణ్ హైదరాబాద్ లోనే ఉండి.. తర్వాత RC15 కొత్త షెడ్యూల్ కి ప్రిపేర్ అవుతారని తెలుస్తుంది.