Advertisementt

విజయ్-సమంత VD11 మొదలైపోయింది

Thu 21st Apr 2022 10:48 AM
vijay deverakonda,samantha,shiva nirvana,mythri movies,family entertainer,vd11,vd11 launched  విజయ్-సమంత VD11 మొదలైపోయింది
VD11 Launched విజయ్-సమంత VD11 మొదలైపోయింది
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో సెట్ అయ్యింది. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ సినిమా స్టార్ట్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ తమ 19వ సినిమాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయ్ దేవరకొండ సరసన సమంత నాయికగా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీశ్ శంకర్ క్లాప్ ఇవ్వగా...ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. స్క్రిప్టును మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు వై రవిశంకర్, నవీన్ యేర్నేని దర్శకుడు శివ నిర్వాణకు అందజేశారు.

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోంది. గీత గోవిందం లాంటి ప్లెజంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో విజయ్ సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లైగర్ వంటి యాక్షన్ ఎంటర్ టైనర్ తర్వాత మళ్లీ చక్కటి కుటుంబ కథలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. 

నిన్ను కోరి, మజిలీ వంటి అందమైన సకుటుంబ ప్రేమ కథల్ని తెరకెక్కించిన శివ నిర్వాణ మరోసారి తన సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్ చేయబోతున్నారు. గతంలో మహానటి చిత్రంలో విజయ్, సమంత కలిసి నటించగా...ఈ సినిమా వారి పెయిర్ ను ఫుల్ ఫ్లెజ్డ్ గా తెరపై చూపించబోతోంది. ఇక మజిలీ చిత్రం తరువాత శివ నిర్వాణ డైరెక్షన్ లో సమంత నటిస్తుండటం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో విజయ్ డియర్ కామ్రేడ్ వంటి డిఫరెంట్ అటెంప్ట్ చేశారు. ఈ సంస్థలో మరోసారి హీరోగా నటిస్తున్నారు. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత సమంత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే కశ్మీర్ లో మొదలవుతుంది. అక్కడ లెంగ్తీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్, వైజాగ్, అల్లెప్పి లలో మిగతా షూటింగ్ జరుపుకుంటుంది.

VD11 Launched :

Vijay Deverakonda, Samantha, Shiva Nirvana, Mythri movies Family Entertainer Grandly Launched 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ