గత కొన్ని వారాలుగా హైపర్ ఆది జబర్దస్త్ కి దూరం దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం జబర్దస్త్ నుండి రోజా జేడ్జ్ గా దూరం అవ్వబోతుంది. మినిస్టర్ హోదాలో రోజా జబర్దస్త్ కి వీడ్కోలు వదిలి వెళ్లిపోయేది ఈ శుక్రవారమే ప్రసారం కాబోతుంది. అయితే రోజా కన్నా ముందే హైపర్ ఆది జబర్దస్త్ కి వీడ్కోలు చెప్పేసినట్లుగా తెలుస్తుంది. కారణం హైపర్ ఆది కి మల్లెమాల యాజమాన్యానికి రెమ్యునరేషన్ విషయంలో ఏదో గొడవ జరిగింది అని, జబర్దస్త్ ని గురువారం తన స్కిట్స్ తోనే నిలబెడుతున్నా.. తన వలనే జబర్దస్త్ నడుస్తుంది అని హైపర్ అన్నాడని.. తన రెమ్యునరేషన్ పెంచమని అడగగా.. దానికి మల్లెమాల యాజమాన్యం నిరాకరించడంతో ఆది జబర్దస్త్ కి దూరంగా ఉంటున్నాడట.
ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ.. ఆది మాత్రం ఢీ డాన్స్ షో కి రెగ్యులర్ గా రావడమే కాదు.. రీసెంట్ గా భీమ్లా నాయక్ స్పూఫ్ స్కిట్స్ కూడా చేసాడు. భీమ్లా నాయక్ గా ఆది, డ్యానియల్ శేఖర్ గా రవి కృష్ణ చేసారు. మరి జబర్దస్త్ లో చెయ్యలాల్సిన స్కిట్స్ హైపర్ ఆది ఇలా ఢీ డాన్స్ షో లో చేస్తున్నాడంటే .. ఇకపై ఆది జబర్దస్త్ లో కనిపించకపోవచ్చనే అనిపిస్తుంది.