కన్నడలో తెరకెక్కిన మాస్ మూవీ కెజిఎఫ్ చాప్టర్ 2 ఇపుడు అన్ని భాషల్లోనూ అదిరిపోయే కలెక్షన్స్ తో బాక్సాఫీసుని కుమ్మేస్తుంది. రాఖి భాయ్ గా యశ్ పెరఫార్మెన్స్ కి, ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన యాక్షన్ సీన్స్, హీరో ఎలివేషన్స్ కి అన్ని భాషలు హీరోలు ఫిదా అవుతున్నారు. నిన్నటికి నిన్న ఆలు అర్జున్ కెజిఎఫ్ చూసి.. రాఖీ భాయ్ గా యశ్ అదరగొట్టేసాడంటూ పొగిడేస్తూ ట్వీట్ చేస్తే.. ఈ రోజు రామ్ చరణ్ కెజిఎఫ్ చాప్టర్ 2 పై ట్వీట్ చెయ్యడం అటు కన్నడ ప్రేక్షకులని, అటు యశ్ ఫాన్స్ ని చాలా థ్రిల్ చేసింది.
నా బ్రదర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కు కంగ్రాట్స్, ఇంతటి భారీ హిట్ కొట్టినందుకు హోంబలే టీమ్ మొత్తానికి కంగ్రాట్స్. యశ్ నీ పెరఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్, స్రీన్ మీద చాలా కమాండబుల్గా కనిపించావు.. ఇంకా సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్ గారి కెరీర్ లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అంటూ కెజిఎఫ్ 2 పై రామ్ చరణ్ తన రివ్యూ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.