Advertisementt

బిగ్ బాస్: ఈవారం ఎలిమినేట్ అయ్యింది.

Sat 23rd Apr 2022 10:18 PM
bigg boss,bigg boss non stop,ajay elimination,najarjuna,ajay,ashu reddy,akhil  బిగ్ బాస్: ఈవారం ఎలిమినేట్ అయ్యింది.
Bigg Boss Non Stop: 8th week elimination బిగ్ బాస్: ఈవారం ఎలిమినేట్ అయ్యింది.
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎనిమిదో వారం పూర్తి కావడానికి మరొక్క రోజే ఉంది. ఎప్పటిలాగే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ విషయంలో హౌస్ మేట్స్ మధ్యన గొడవలు జరిగాయి. నామినేషన్స్ లోను బిందు మాధవి కి ఫ్రెండ్ శివ కి గొడవ జరిగింది. ఇక బాబా భాస్కర్ ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. ఆయన సంచాలక్ గా ఉండి టాస్క్ లు ఆడించడం, ఆ పనిలో బాబా చక్కగా ప్రదర్శన ఇవ్వడంతో.. బాబా భాస్కర్ కూడా ఈ వారం కెప్టెన్సీ పోటీ దారుడు అయ్యాడు. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ పక్కనబెడితే.. ఈ వారం ఎలిమేమినేషన్ మాత్రం మాములుగా ఉండదు అనేలా ఉంది. ఎందుకంటే అఖిల్, అశు రెడ్డి, హమీద, అనిల్, అజయ్ ఇలా ఐదుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి. 

ఈ ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో.. గత రెండు వారాలుగా స్ట్రాంగ్ అయిన తేజస్వి, మహేష్ విట్టాలు ఎలిమినేట్ అయ్యారు.. సో ఈ వారం ఎలిమినేషన్ పై అందరిలో ఆసక్తి, ఆత్రుత మొదలయ్యింది. అయితే ఈ వారం అఖిల్ - అనిల్ ఓటింగ్స్ లో పోటీ పడగా.. తర్వాత ప్లేస్ లో హమీద, ఆశు రెడ్డి లు పోటీ పడ్డారు. చివరిగా అజయ్ డేంజర్ జోన్ లోకి వెళ్లడమే కాదు.. ఈవారం ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడినట్టుగా సోషల్ మీడియా లీకులు చెబుతున్నాయి. రేపు ఆదివారం నాగార్జున ఎపిసోడ్ లో అజయ్ బయటికి రావాల్సి ఉండగా.. ఈ ఎపిసోడ్ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. దానితో అజయ్ ఎలిమినేషన్ వివరాలు బయటికి వచ్చేసాయి. 

Bigg Boss Non Stop: 8th week elimination :

Bigg Boss non stop eighth week Ajay elimination

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ