బిగ్ బాస్ నాన్ స్టాప్ లోకి వచ్చాక హీరోయిన్ బిందు మాధవి తనదైన ఆటతీరు, తనదైన వాక్స్చతుర్యంతో మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అఖిల్ కి గట్టి పోటీ ఇస్తూ టైటిల్ ఫెవరెట్ గా మారిపోయింది. ఈ సీజన్ మొదలైన మొదటి వారం నుండి వరసగా నామినేషన్స్ లోకి వస్తున్న బిందు మాధవి ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ బాబా భాస్కర్ వలన సేవ్ అయ్యి నామినేషన్స్ నుండి తప్పించుకుంది. ఇక ఈ వారం నామినేషన్స్ విషయంలో బిందు మాధవి కి అఖిల్ కి బాత్ రూమ్ దగ్గర సంభాషణ విషయంలో పెద్ద రచ్చ జరిగింది. యాంకర్ శివ కూడా అఖిల్ కి సపోర్ట్ గా మాట్లాడాడు. దానితో బిందు మాధవి శివ ఫ్రెండ్ షిప్ కట్ చేసింది.
అయితే ఈ ఆదివారం నాగార్జున బిందు మాధవికి షాక్ ఇచ్చారు. ఆదివారం ఎపిసోడ్ లో బిందు మాధవి కి అఖిల్ కి జరిగిన బాత్ రూమ్ సంభాషణ విషయంలో నాగార్జున బిందు మాధవిని - శివని కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు. తర్వాత అఖిల్ ని కూడా పిలిచి అడిగాడు. అఖిల్ తనను పక్కకు రా అన్నాడని బిందూ నామినేషన్స్ లో చేసిన ఆరోపణల గురించి నాగ్ వీడియోను చూపించగా.. మొదట బిందు మాధవి అలా అన్నట్లు అర్థం అయింది. ఆ తర్వాత బిందు అజయ్‌తో జరిగిన సంభాషణను కూడా నాగ్ బయటికి తీశారు. ఇందులోనూ బిందూనే తప్పుగా మాట్లాడినట్లు తేలింది.. సో ఈ వారం నాగార్జున బిందు కి అలా వీడియో చూపించి బిగ్ షాక్ ఇచ్చాడు.