జబర్దస్త్ కమెడియన్స్ అంతా స్టార్ మా కామెడీ స్టార్స్ లోనే కనబడుతున్నారు. మెయిన్ కమెడియన్స్ తప్ప జబర్దస్త్ లో పేరున్న వారెవరూ కనిపించడం లేదు. ప్రెజెంట్ ఈటివి కామెడీ షో కి మబ్బు పట్టింది. అటు పర్మినెంట్ జేడ్జ్ లేరు. ఇటు కమెడియన్స్ కూడా పక్క ఛానల్స్ కి పోతున్నారు. ప్రస్తుతం జబర్దస్త్ లో నాలుగు వారాలుగా హైపర్ ఆది కనిపించడం లేదు, ఆయన స్కిట్స్ మిస్ అవుతున్న ఆడియన్స్ ఫీలవుతున్నారు.
అయితే ఇప్పుడు ఆది కూడా పారితోషకం కోసం జాబర్దస్త్ ని వీడాడు అనే టాక్ మొదలయ్యింది. అందుకే పక్క ఛానల్ స్టార్ మా లో కమేడియన్స్ జబర్దస్త్ కన్నా డబుల్ పారితోషకాలు వస్తున్నాయని హైపర్ ఆది కూడా స్టార్ కి జంప్ అవ్వబోతున్నాడని, ప్రస్తుతం సన్నిహితులతో ఆది స్టార్ మా కి వెళ్లేందుకు చర్చలు జరుపుతున్నాడనే న్యూస్ మొదలయ్యింది. మరి నిజంగా హైపర్ ఆది కూడా స్టార్ మా కి వెళితే.. కామెడీ స్టార్స్ కి హెల్ప్ అవడమే కాదు, దానికి టాప్ టిఆర్పి రావడం ఖాయమంటున్నారు. ఎందుకంటే హైపర్ ఆది పంచ్ లు అలా ఉంటాయి కాబట్టి. ఇక ఆది కూడా జబర్దస్త్ వదిలేస్తే గనక జబర్దస్త్ మనుగడకి కష్టమే.