కెజిఎఫ్ చాప్టర్ 2 తో మరోసారి అన్ని భాషల ప్రేక్షకులతో హిట్ అనిపించుకోవడమే కాదు.. ఆయా భాషల హీరోల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు యశ్ అండ్ ప్రశాంత్ నీల్ లు. కెజిఎఫ్ చాప్టర్ 2 హిట్ అవడం పట్ల ఒక్క టాలీవుడ్ హీరోలు విపరీతమైన హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ తర్వాత తెలుగు హీరోలతోనే పని చేస్తున్నారు. ప్రెజెంట్ సలార్ సెట్స్ మీదుంటే.. తర్వాత ఎన్టీఆర్ తో మరో మూవీ ఉంది. ఆ తర్వాత రామ్ చరణ్ తో ప్రశాంత్ నీల్ చేసే అవకాశం లేకపోలేదు. సో అలా స్టార్ హీరోలు హ్యాపీ ఫీల్ అవడమే కాదు.. కెజిఎఫ్ హిట్ పై ట్వీట్స్ చేస్తున్నారు. కానీ మిగతా భాషల హీరోలు కామ్ అయ్యారు. కెజిఎఫ్ పై ఆయా భాషల హీరోలు ఎలాంటి ట్వీట్ వేసిన పాపాన పోలేదు. అదలా ఉంటే.. కెజిఎఫ్ హిట్ తర్వాత యశ్ ఫ్యామిలీతో గోవాకి వెళ్లాడని, ఎయిర్ పోర్ట్ లో యశ్ కనిపించాడని అన్నారు కానీ క్లారిటీ లేదు.
ఇక తాజాగా గోవా లో కెజిఎఫ్ చాప్టర్ 2 సక్సెస్ పార్టీ జరిగినట్లుగా కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాతలు ఈ సక్సెస్ పార్టీలో కేక్ కట్ చేసి హాగ్ చేసుకున్న ఫొటోస్ అవి. మరి కెజిఎఫ్ టీం అంతా లేకపోయినా.. ఇలా యశ్, ప్రశాంత్ నీల్ నిర్మాతలు కలిసి పార్టీ చేసుకోవడం ఫాన్స్ కి కిక్ ఇచ్చింది. మీరూ కెజిఎఫ్ 2 సక్సెస్ పార్టీ పిక్ పై ఓ లుక్కెయ్యండి.