Advertisementt

RC15 స్టోరీ రివీల్డ్

Sun 24th Apr 2022 11:06 PM
ram charan,acharya interview,rc 15,shanakr,sj surya  RC15 స్టోరీ రివీల్డ్
RC 15 story revealed RC15 స్టోరీ రివీల్డ్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ - శంకర్ కలయికలో తెరకెక్కుతున్న RC 15 ని దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. మూడు భాషల్లో క్రేజీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ సీబీఐ ఆఫీసర్ గా కనబడతాడని, కియారా అద్వానీ చరణ్ పిఏ గా ఉంటుంది అని, విలన్ ఎస్ జె సూర్య సీఎం గా స్టైలిష్ విలనిజాన్ని పండిస్తాడని అంటున్నారు. అయితే తాజాగా రామ్ చరణ్ ఆచార్య ఇంటర్వూస్ లో RC 15 స్టోరీ పై చిన్నఅప్ డేట్ ఇవ్వడంతో మెగా ఫాన్స్ ఖుషి అవుతున్నారు.

పవర్ ఫుల్ ఆఫీసర్లుగా కొంతమంది మన సమాజానికి ఇన్స్పిరేషన్ గా నిలిచారో.. మన జాతి నిర్మాణానికి రోల్ మోడల్ గా నిలిచారో... అలాంటి వారి లైఫ్ ని ఆధారంగా చేసుకుని RC 15 తెరకెక్కిస్తున్నామని అన్నారు. ఈ సినిమా ఒక పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తుంది. మాజీ సీబీఐ ఆఫీసర్ జెడి లక్ష్మీనారాయణ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా ఉండబోతుంది అంటూ ఎప్పటినుండో ప్రచారంలో ఉండగా.. ఇప్పుడు చరణ్ చెప్పిన దానికి సింక్ అవడంతో ఈ క్రేజీ మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి శంకర్ చరణ్ ని ఏ స్టయిల్లో చూపిస్తారో అనే ఆత్రుత అయితే మెగా ఫాన్స్ లో ఉంది.  

RC 15 story revealed :

Ram Charan about RC 15

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ