Advertisementt

పూజ హెగ్డే బాగా హైలెట్ అవుతుందే

Mon 25th Apr 2022 10:37 AM
pooja hegde,acharya promotions,acharya,ram charan,koratala,chiranjeevi  పూజ హెగ్డే బాగా హైలెట్ అవుతుందే
Pooja Hegde is well highlighted పూజ హెగ్డే బాగా హైలెట్ అవుతుందే
Advertisement
Ads by CJ

ఇప్పుడు అందరి నోటా ఒకటే మాట.. అసలు ఆచార్య మూవీలో కాజల్ హీరోయినా? లేదంటే పూజ హెగ్డే హీరోయినా? అనేది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ కనిపించడం లేదు.. కనీసం వినిపించడం లేదు. అదే టైం లో ఆ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన పూజ హెగ్డే మాత్రం విపరీతంగా హైలెట్ అవుతుంది. అసలే రాధేశ్యామ్, బీస్ట్ ప్లాప్స్ తో కాస్త డల్ మోడ్ లోకి వెళ్లిన పూజ హెగ్డే ఆచార్య తో మళ్ళీ లైం టైం లోకి రావాలని ట్రై చేస్తుంది. బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ ఉన్నాయి. సో ఆచార్య తో హిట్ కొట్టాలి.. అంటే ప్రమోషన్స్ లో ఆక్టివ్ గా ఉండాలి అన్నట్టుగా కనిపిస్తుంది పూజ హెగ్డే వ్యవహారం. 

అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసింది. ఛానల్స్ లో చరణ్ తో ఇంటర్వ్యూలకి హాజరవుతుంది. మరి మెయిన్ హీరోయిన్ గా కాజల్ పేరు ఎత్తని టీం పూజ ని మాత్రం పొగిడేస్తున్నారు. సిద్ద - నీలాంబరి అంటూ వారి పాటలని హైలెట్ చెయ్యడం, వారి గురించి మాట్లాడడం ఇది ఆచార్య టీం చేస్తుంది. చిరుకి జోడిగా నటించిన కాజల్ అసలు సినిమాలో ఉంటుందో.. లేదో అనే అనుమానాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. అటు చూస్తే రామ్ చరణ్ కూడా కాజల్ పాత్ర గురించి ఐడియానే లేదంటున్నారు. మరోపక్క పూజ హేగ్డ్ ఎని హైలెట్ చెయ్యడమే ఎవరికి అర్ధం కాకుండా పోతుంది. కాజల్ పాత్ర మాత్రం సినిమా రిలీజ్ అయ్యేవరకు ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపించేదిలా కనిపిస్తుంది.  

Pooja Hegde is well highlighted:

Pooja Hegde at Acharya promotions

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ