గరుడ వేగ టైం లో తన దగ్గర 26 కోట్లు అప్పు తీసుకుని ఇప్పుడు ఆ డబ్బు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారంటూ జీవిత రాజశేఖర్ పై జోస్టర్ ఫిలిమ్స్ అధినేత ప్రొడ్యూసర్ కోటేశ్వరరావు అలిగేషన్స్ చేసిన విషయం తెలిసిందే. అలాగే జీవిత రాజశేఖర్ పై నాన్ బెయిల్ బుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.. జీవిత జైలుకి వెళ్లడం ఖాయమని కోటేశ్వరావు అన్నారు. దానికి జీవిత మేము ఎవ్వరిని మోసం చెయ్యలేదు, కోర్టు లో కేసు నడుస్తుంది.. నేను అరెస్ట్ కాలేదు.. మా తప్పు లేకపోతె దేవుడితోనైనా పోరాడతాను అంటూ మీడియా ముఖంగా చెప్పారు.
అయితే మళ్ళీ గరుడ వేగ ప్రొడ్యూసర్ కోటేశ్వరరావు జీవితం రాజశేఖర్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. జీవిత రాజశేఖర్ డబ్బు మనిషి అని, రాజశేఖర్ తండ్రిని తీసుకుని వచ్చి నా భార్య హేమ కాళ్ళు పట్టుకుని 26 కోట్లు అప్పు తీసుకుంది అని, కూతుళ్ళని అడ్డం పెట్టుకుని జీవిత రాజశేఖర్ డబ్బు గుంజే ప్రయత్నం చేస్తుంది అని, జీవిత ప్రొడ్యూసర్స్ ని ట్రాప్ చేస్తుంది అని, రాజశేఖర్ ఒకప్పుడు డ్రగ్స్ తో పట్టుబడితే తామే విడిపించామని.. జీవిత రాజశేఖర్ ని ఎవ్వరూ నమ్మొద్దు ఆమె అందరిని మోసం చేస్తుంది అంటూ కోటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేసారు.