చిరంజీవి - కొరటాల - రామ్ చరణ్ కాంబోలో క్రేజీ మూవీ గా తెరకెక్కిన ఆచార్య ఈ శుక్రవారమే విడుదల కాబోతుంది. అటు ట్రేడ్ లోను, ఇటు ఆడియన్స్ లోను భారీ అంచనాలున్న ఆచార్య మూవీ ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్, రామ్ చరణ్ స్పెషల్ ఇంటర్వూస్, ఛానల్స్ ఇంటర్వూస్, చిరు-కొరటాల ఇంటర్వూస్ అంటూ హంగామా చేసున్నారు. అయితే ఇప్పుడు ఆచార్య మూవీ మేకర్స్ కి తెలంగాణ ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
అదేమిటంటే ఆచార్య విడుదలవుతున్న ఏప్రిల్ 29 నుండి మే 5 వరకు థియేటర్స్ లో టికెట్ రేట్స్ పెంచుకునే వెసులుబాటు కలిపించడంతో ఆచార్య మేకర్స్ సంతోషకంగా ఉన్నారు. ఒక్కో టికెట్‌పై మల్టీప్లెక్స్‌లో 50 రూపాయలు, సాధారణ థియేటర్స్‌లో 30 రూపాయలు పెంచుకునేలా వెసులుబాటు కల్పిస్తూ కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా తెలంగాణాలో ఆచార్య ఐదో ఆటకి కూడా పర్మిషన్స్ ఇచ్చెయ్యడంతో మేకర్స్ ఖుషీగా ఉన్నారు.
కానీ ఆడియన్స్ మాత్రం ఉసూరుమంటున్నారు. పెరిగిన టికెట్ ధరలతో సినిమాకు వెళ్లాలంటే సామాన్య మానవుడికి కష్టమే కదా.. ఆర్ ఆర్ ఆర్ విషయంలోనూ పెరిగిన ధరలతో మనస్ఫూర్తిగా సినిమాని ఎంజాయ్ చేయలేకపోయాము.. ఇప్పుడు ఆచార్యకి కూడా ఇంతే అంటూ ఢీలా పడిపోతున్నారు వారు.