Advertisementt

ఈ సినిమా హిట్ కంపల్సరీ

Tue 26th Apr 2022 10:23 AM
pooja hegde,acharya promotions,acharya movie,ram charan,chiranjeevi  ఈ సినిమా హిట్ కంపల్సరీ
Pooja Hegde look beautiful in a traditional saree ఈ సినిమా హిట్ కంపల్సరీ
Advertisement
Ads by CJ

మరో మూడు రోజుల్లో టాలీవుడ్ ఆచార్యుడు చిరంజీవి ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఏప్రిల్ 29 న కొడుకు రామ్ చరణ్ తో కలిసి సందడి చెయ్యడానికి రెడీ అయ్యాడు. మరి ఈ సినిమా హిట్ కంపల్సరీ అంటుంది పూజ హెగ్డే. ఎందుకంటే ఆమె నటించిన పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ పెరఫార్మెన్స్ బాలేదు. అలాగే కోలీవుడ్ లో విజయ్ తో నటించిన బీస్ట్ కూడా డిజాస్టర్ అవడంతో పూజ హెగ్డే క్రేజ్ తగ్గడం ఖాయం. అందుకే ఆమెకి ఆచార్య హిట్ కంపల్సరీ అనేది. పూజ హెగ్డే నీలాంబరిగా ఆచార్య లో రామ్ చరణ్ తో రొమాన్స్ చేస్తుంది. 

నీలాంబరిగా కూల్ గా ట్రెడిషనల్ లుక్స్ లో అదరగొట్టేస్తున్న పూజ కి ఆచార్య హిట్ కావాల్సిందే. చిరు, చరణ్ కి ఆచార్య హిట్ ఎంత అవసరమో తెలియదు కానీ.. ఆ సినిమా హిట్ అయితేనే మళ్ళీ ఆమె క్రేజ్ పెరుగుతుంది లేదంటే పూజ మార్కెట్ పడిపోతుంది.. ఆమెకి అవకాశాలు తగ్గుతాయి. తర్వాత స్టార్ ఛాన్సెస్ రావడం కూడా కష్టమే మరి. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ లో సారీస్ తో అదరగొట్టేస్తూ అందరి చూపు తిప్పుకుంటుంది. ఎంతగా బీస్ట్ అరబిక్ కుతు సాంగ్ హిట్ అయినా.. ఆ సినిమాలో పూజ రోల్ పై చాలా విమర్శలు వచ్చాయి. సో ఆచార్య లో కీలక పాత్రలో కనిపించబోతున్న పూజ హెగ్డే హిట్ కొట్టేయాలని కోరుకుందాం.

Pooja Hegde look beautiful in a traditional saree:

Pooja Hegde look beautiful in a traditional saree at Acharya promotions

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ