బాలకృష్ణ మోకాలి కి సర్జరీ చేయించుకున్నారు, గత కొన్ని రోజులుగా ఆయన మోకాలి నొప్పితో బాధపడుతుండడంతో.. వైద్యులు ఆయన మోకాలికి ఆపరేషన్ చెయ్యగా.. కొద్దిపాటి విశ్రాంతి అవసరం అని.. అది కూడా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అంటూ ఓ పిక్ ని షేర్ చేసి మరీ ఓ న్యూస్ ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసారు. ఈ రోజు ఉదయం నుండి పలు టివి ఛానల్స్ లోను, పలు వెబ్ సైట్స్ లోను బాలయ్య మోకాలి సర్జరీ వార్తలే ప్రసారంలో ఉన్నాయి. అలాగే ఆయన నటిస్తున్న NBK 107 షూటింగ్ కూడా పోస్ట్ పోన్ అయినట్లుగా వార్తలొచ్చాయి.
అయితే ఇవన్నీ గాలి వార్తలే అని, నందమూరి బాలకృష్ణ కి ఎటువంటి సర్జరీ జరగలేదు అంటూ.. ఆయన కేవలం రెగ్యులర్ చెకప్ కొరకు మాత్రమే హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది.. అని బాలయ్య పిఆర్ టీం క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా బాలకృష్ణ ఈ రోజు సారధి స్టూడియోస్ లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న #NBK107 షూటింగ్ లో పాల్గొనబోతున్నారంటూ అప్ డేట్ కూడా ఇచ్చారు. దయ చేసి అవాస్తవాలను ప్రచురించవద్దు, వ్యాప్తి చేయవద్దు.. అంటూ పిఆర్ టీం తెలియజేసింది. సో బాలయ్య మోకాలి సర్జరీ పై వస్తున్న వార్తలు, అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పిక్ ఫేక్ అన్నమాట.