బాహుబలి తర్వాత ప్రభాస్ ఫిజిక్ విషయంలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కుంటున్నారు. సాహో, నిన్నటికి నిన్న రాధే శ్యామ్ లుక్ విషయంలోనూ ప్రభాస్ విమర్శలు ఎదుర్కొన్నారు. అటు లుక్ పరంగాను ఇటు ఫిజిక్ పరంగాను ప్రభాస్ ని ఫాన్స్ కూడా విమర్శిస్తున్నారు. చేతిలో బోలెడన్ని క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ప్రభాస్ బరువు తగ్గి కాస్త సన్నబడితేనే మళ్ళీ మునుపటి ప్రభాస్ కనిపిస్తారు.. మిర్చి లో, బాహుబలిలో ప్రభాస్ ని అలా చూసి ఇప్పుడు ఇలా బరువు పెరిగి.. స్క్రీన్ మీద కదలడానికి ఇబ్బంది పడుతున్న ఆయన్ని చూసి ఫాన్స్ నీరుగారిపోతున్నారు. ఆదిపురుష్ లో ప్రభాస్ వి షేప్ లో మారారంటూ ఓం రౌత్ చెప్పారు కానీ.. ఫాన్స్ కి నమ్మకం లేదు. అదలా ఉంటే.. ఇకపై ప్రభాస్ ని కొత్తగా చూడబోతున్నామట.
ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు బరువు తగ్గేందుకు కష్టపడుతున్నాడట. లుక్ మార్చాలని, ఫిట్నెస్ కొత్తగా ఉండాలని.. తన పర్సనల్ ట్రైనర్ ఆధ్వర్యంలో ప్రభాస్ వర్కౌట్స్ చేస్తూ కొవ్వు కరించేస్తున్నాడట. ఈసారి ఎలాగైనా బరువు తగ్గాలని ప్రభాస్ బలంగా ఫిక్స్ అయ్యాడట. ఎందుకంటే ప్రాజెక్ట్ కె, సలార్, స్పిరిట్ లాంటి చిత్రాల్లో ప్రభాస్ ఎంత మాస్ గా కనిపించినా.. ఆయన వెయిట్ విషయంలో ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదు. అందుకే ఈసారి బరువు తగ్గేందుకు ప్రభాస్ గట్టిగా ట్రై చేస్తున్నారట.