Advertisementt

బిగ్ బాస్: హౌస్ మేట్స్ పై అజయ్ కామెంట్స్

Tue 26th Apr 2022 01:59 PM
bigg boss nonstop,bigg boss,ajay,akhil bindu madhavi  బిగ్ బాస్: హౌస్ మేట్స్ పై అజయ్ కామెంట్స్
Bigg Boss Nonstop: Ajay comments on Housemates బిగ్ బాస్: హౌస్ మేట్స్ పై అజయ్ కామెంట్స్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నుండి ఎనిమిదో వారంలో ఎలిమినేట్ అయిన స్ట్రాంగ్ కంటెస్టెంట్ అజయ్ అంటే బిగ్ బాస్ కి వెళ్ళకముందు ఎవరికీ పెద్దగా తెలియని ముఖం. బిగ్ బాస్ లోకి వెళ్ళకముందు విశ్వక్ అనే మూవీ తో హీరో గా పరిచయమైన అజయ్ బిగ్ బాస్ నాన్ స్టాప్ లోకి అడుగుపెట్టాకా అఖిల్, ఆశు లతో చేసిన ఫ్రెండ్ షిప్ కాస్త హెల్ప్ అయ్యి హౌస్ లో కొనసాగాడు అనేది ఆడియన్స్ అభిప్రాయమే కాదు, హౌస్ మేట్స్ అభిప్రాయం కూడా. అయితే అఖిల్ తో క్లోజ్ గా వున్న అజయ్ ఎలిమినేట్ అయ్యే ముందు అఖిల్ అజయ్ ని దూరం పెట్టేసాడు. కారణం అజయ్ బిందు కి క్లోజ్ అవుతున్నాడని అఖిల్ అజయ్ కి దూరమయ్యాడట.

అయితే తాజాగా అజయ్ బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక హౌస్ మేట్స్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అఖిల్ తో ఉన్నన్నాళ్ళు హౌస్ లో సేఫ్ గా ఉన్నావ్.. అఖిల్ కి దూరమవ్వగానే ఎలిమినేట్ అయ్యావ్ అంటూ యాంకర్ రవి అడగ్గానే.. అదేం లేదు.. అని అన్న అజయ్.. నటరాజ్ మాస్టర్ కొద్దిగా కంట్రోల్ లో ఉంటే బావుంటుంది అని, అలాగే శివ ఎంత స్మార్ట్ గా గేమ్ ఆడినా.. అతను ఆట విషయంలో విలువలు మర్చిపోతాడని, ఇక బిందు ఓవర్ థింకింగ్ తగ్గిస్తే బావుంటుంది అని.. ఆమె చాలా స్మార్ట్ ప్లేయర్ అని చెప్పిన అజయ్ అరియనా ఇప్పుడే గేమ్ స్టార్ట్ చేసింది అని చెప్పాడు. అయితే తన ఫ్రెండ్ అఖిల్ మాత్రం బిగ్ బాస్ కప్ తీసుకురావాలని అజయ్ బలంగా కోరుకుంటున్నాడు.

Bigg Boss Nonstop: Ajay comments on Housemates :

Bigg Boss Nonstop: Ajay on Akhil

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ