పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఆదిపురుష్ లో మేజర్ పార్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఉండడంతో.. ప్రస్తుతం ఓం రౌత్ ఆ పనుల్లో బిజీగా ఉండగా ప్రభాస్ తన తదుపరి ప్రాజెక్ట్స్ కి వెళ్లిపోయారు. అయితే ఆదిపురుష్ రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న మోడరన్ రామాయణంలో ప్రభాస్ మోడరన్ రాముడిగా కనిపించబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ ఆదిపురుష్ బిజెపి వారి ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న సినిమా అంటూ తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. బిజెపి భావజాల వ్యాప్తి చేసేందుకు బీజేపీ మొత్తం 16 సినిమాలను సిద్ధం చేస్తోంధీ అంటూ కేటీఆర్ ఆరోపిస్తున్నారు.
ఇప్పటికే ఉరి, ది కాశ్మీర్ పైల్స్ లాంటి బిజెపి కి అనుకూలమైన సినిమాలు విడుదలయ్యాయి. ఇక ప్రభాస్ ఆదిపురుష్ విడుదలకు సిద్ధంగా ఉంది. మిగతా సినిమాలను కూడా సమయం చూసుకుని విడుదల చేస్తారని, ఆదిపురుష్ ని శ్రీరాముని సెంటిమెంట్ గా రెచ్చగొట్టి రామ రాజ్యం అంటే బీజేపీ ప్రభుత్వమే అనే భావన ప్రజల్లో కల్పించడం కోసమే ఈ సినిమా చేస్తున్నారంటూ కేటీఆర్ ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు గారు బిజెపి వారే కాబట్టి ప్రభాస్ కి తెలిసే ఈ ఆదిపురుష్ తెరకెక్కి ఉండవచ్చు అంటూ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు.