గత కొన్ని రోజులుగా కియారా అద్వానీకి - హీరో సిద్దార్థ్ మల్హోత్రాకు బ్రేకప్ అయ్యింది అంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రెండేళ్లుగా ప్రేమలో ఉండి.. వెకేషన్స్ కి తిరుగుతూ సీక్రెట్ రిలేషన్ ని మెయింటింగ్ చేసిన ఈ జంట కొద్ది రోజులుగా పబ్లిక్ గానే పార్టీలకి, ఫంక్షన్స్ కి అటెండ్ అయ్యారు. కానీ ఇప్పుడు వీరి మధ్యన విభేదాలు తలెత్తడంతో కియారా - సిద్దార్థ్ లు లవ్ కి బ్రేకప్ చెప్పుకున్నారంటూ బాలీవుడ్ మీడియా టాక్. అయినా కియారా తరుపు నుండి కానీ, సిద్దార్థ్ తరపు నుండి కానీ ఎలాంటి క్లారిటీ రాలేదు.
అయితే తాజాగా కియారా - కార్తీక్ ఆర్యన్ కలిసి నటించిన బాలీవుడ్ మూవీ ప్రమోషన్స్ లో కియారా కి మీడియా నుండి సిద్దార్థ్ తో బ్రేకప్ ప్రశ్న ఎదురవుతూనే ఉంది. మీరు సిద్దార్థ్ విడిపోయారంట కదా అంటూ కియారని మీడియా అడుగుతూనే ఉంది. కానీ కియారా మాత్రం ఈ ప్రశ్నకి మౌనమే సమాధానం అన్నట్టుగా సైలెంట్ గా ఉండిపోతుంది తప్ప ఆన్సర్ చెయ్యడం లేదు. కొన్నిసార్లు ఆ ప్రశ్నని స్కిప్ చేసేస్తుంది కూడా.. సో దీనిని బట్టి కియారా - సిద్దార్థ్ మధ్యన బ్రేకప్ వార్తలు నిజమే అని ఫిక్స్ అవుతున్నారు జనాలు.