ప్రభాస్ రాధే శ్యామ్ తర్వాత ప్రాజెక్ట్ కె షూటింగ్ అలాగే సలార్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ప్రాజెక్ట్ కె షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంటే.. మే ఫస్ట్ వీక్ నుండి సలార్ షూట్ కూడా మొదలు కాబోతుంది. ఇది కూడా రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్ లోనే మొదలు కాబోతుంది. ఈ సినిమాల తర్వాత ప్రభాస్ స్పిరిట్ మూవీ చెయ్యాల్సి ఉంది. కానీ మధ్యలో కామెడీ డైరెక్టర్ మారుతీ లైన్ లోకి వచ్చాడు. ప్రభాస్ తో ఓ మూవీ చెయ్యడానికి మారుతీ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇప్పటికే స్టోరీ ఫైనల్ అయ్యి స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్లుగా తెలుస్తుంది.
అయితే ప్రభాస్ - మారుతి ప్రాజెక్ట్ ఎక్కువ శాతం ఓ ఇంటి సెట్ లో జరగబోతుందట. దాని కోసమే 18000 చదరపు అడుగుల లావిష్ ఇంటి సెట్ నిర్మిస్తున్నారట. ఈ భారీ ఇంటి సెట్ లోనే ప్రభాస్ - మారుతి ప్రాజెక్ట్ మేజర్ పార్ట్ షూటింగ్ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ డేట్స్ చాలా తక్కువగా సరిపోతాయని, మారుతీ కూడా ఆరు నెలలోనే సినిమా పూర్తి చేస్తానని ప్రభాస్ కి మాటివ్వడంతోనే ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది.