Advertisementt

RC 16 పై రామ్ చరణ్ కామెంట్స్

Wed 27th Apr 2022 07:16 PM
ram charan,rc16,gowtham tinnanuri,shankar,rc 15,acharya promotions  RC 16 పై రామ్ చరణ్ కామెంట్స్
Ram Charan comments on RC16 RC 16 పై రామ్ చరణ్ కామెంట్స్
Advertisement
Ads by CJ

 

రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ హిట్ తో పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టి.. ఆచార్య కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గత వారం రోజులుగా ఆచార్య ప్రమోషన్స్ లో రామ్ చరణ్ బిజీగా ఉన్నారు. ఓ వైపు అయ్యప్ప మాల వేసుకున్న రామ్ చరణ్ ఈ రోజు ఉదయమే విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఆచార్య ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ తన తదుపరి సినిమాల విషయంలో చిన్న క్లూ ఇస్తూ మెగా ఫాన్స్ ని ఫుల్ కిక్కు ఇస్తున్నారు. ఇప్పటికే చరణ్, శంకర్ తో చెయ్యబోయే RC 15 పై చిన్నపాటి అప్ డేట్ ఇచ్చారు. ఆ సినిమా చరిత్రలో నిలిచిపోయిన పవర్ ఫుల్ ఆఫీసర్స్ నేపథ్యంలో తెరకెక్కుతుంది అని.

ఇక తాజాగా రామ్ చరణ్ ఆ తదుపరి సినిమా RC16 పై ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ని రివీల్ చేసారు. గౌతమ్ తిన్ననూరి విషయంలో మెగా ఫాన్స్ టెంక్షన్ లో ఉన్నారు, ఎందుకంటే హిందీ జెర్సీ కి నెగెటివ్ టాక్ వచ్చింది.. సో మెగా ఫాన్స్ లో భయం మొదలైంది అని, అలాగే గౌతమ్ తిన్ననూరి చరణ్ తో చెయ్యబోయే మూవీ స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్ లోనే ఉండబోతుంది అని ప్రచారం జరుగుతుంది. ఆ విషయమై మీడియా వారు చరణ్ ని అడగగా.. గౌతమ్ తో చేసే కథ స్పోర్ట్స్ నేపథ్యానికి సంబంధించినది కాదు. ఎమోషన్ తో కూడిన యాక్షన్ డ్రామాగా సాగుతుంది అంటూ రామ్ చరణ్ RC 16 గురించిన ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పడం తో మెగా ఫాన్స్ కూడా కూల్ అవుతున్నారు.

Ram Charan comments on RC16:

RC16 update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ