Advertisementt

సమంత బర్త్ డే సెలెబ్రేషన్స్

Thu 28th Apr 2022 09:57 AM
samantha,samantha birthday celebrations,samantha birthday celebrations with staff  సమంత బర్త్ డే సెలెబ్రేషన్స్
Samantha Birthday Celebrations సమంత బర్త్ డే సెలెబ్రేషన్స్
Advertisement
Ads by CJ

ఒకప్పుడు గ్రాండ్ గా బర్త్ డే ని సెలెబ్రేట్ చేసుకున్న సమంత ఇప్పుడు ఒంటరిగా బర్త్ డే ని సెలెబ్రేట్ చేసుకుంటుంది. చైతు తో విడిపోయాక సమంత కొన్నాళ్ళు కామ్ గా ఉన్నా.. ఇప్పుడు చేతినిండా షూటింగ్స్ తో కళకళలాడుతుంది. నయనతార, విజయ్ సేతుపతి తో స్క్రీన్ షేర్ చేసుకున్న సమంత క్రేజీగా ఆమె బర్త్ డే రోజునే ఆ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. అలాగే శాకుంతలం, యశోద నుండి సమంత కి స్పెషల్ పోస్టర్స్ తో బర్త్ డే గ్రీటింగ్స్ కూడా అందాయి. ఇక తాజాగా సమంత థాయ్ లాండ్ వెకేషన్ ముగించుకుని.. కాశ్మీర్ లో ల్యాండ్ అయ్యింది. కాశ్మీర్ లో విజయ్ సేతుపతి తో కలిసి VD11 లో నటిస్తుంది. కాశ్మీరీ గర్ల్ గా సమంత ఆ మూవీలో కనిపించబోతుంది.

ఈ రోజు పుట్టిన రోజు సందర్భంగా సమంత తన స్టాఫ్ మధ్యలో కేక్ కట్ చేసి పుట్టిన రోజుని చాలా సింపుల్ గా ముగించేసింది. అలా స్టాఫ్ మధ్యలో సమంత బర్త్ డే వేడుకల పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంటే ఉదయం ఇలా సింపుల్ గా చేసుకున్న సమంత.. సాయంత్రానికి పార్టీ మూడ్ లోకి వెలుతుందేమో చూడాలి. ఎందుకంటే సమంత పార్టీల విషయంలో ఎక్కడా కంప్రమైజ్ కాదు, అలాగే వెకేషన్స్ విషయంలోనూ ఎక్కడా తగ్గదు కూడా. ఇప్పుడు గ్లామర్ షో విషయంలోనూ సమంత ఓ రేంజ్ లో హైలెట్ అవుతుంది. మరి బాలీవుడ్, హాలీవుడ్ రేంజ్ లో ఉండాలంటే సమంత చేసే గ్లామర్ షో అతి ముఖ్యం కాబట్టి. ఇక నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సమంత కి సినీజోష్ టీం తరపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.

Samantha Birthday Celebrations:

Samantha Birthday Celebrations with staff 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ