బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఈ వారం అంటే చివరి వారం కెప్టెన్సీ టాస్క్ లో నటరాజ్ మాస్టర్ సీక్రెట్ కిల్లర్ గా హౌస్ లోని యాంకర్ శివ, అనిల్ రాథోడ్, అఖిల్ సార్థక్, హమీదాలను వారికి తెలియకూండానే చంపేశాడు. ఇక చంపకుండా మిగిలిన బిందు, ఆశు, బాబా భాస్కర్, మిత్రాలను కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక చేసాడు బిగ్ బాస్. నటరాజ్ తో పాటుగా బాబా భాస్కర్, ఆశు, బిందు, మిత్ర శర్మలు ఈ చివరి వారం కెప్టెన్సీ టాస్క్ లో పోటీ పడ్డారు.
అయితే ఈ టాస్క్ లో బిగ్ బాస్ బ్రిక్స్ ఛాలెంజ్ ఇవ్వగా.. అందులో ఒక్కో ఇటుకని పేర్చుకుంటూ వెళ్లాల్సి ఉంది. ఇలా చివరి వరకూ బ్రిక్స్ పేరుస్తూ ఎవరు మిగులుతారో వాళ్లే ఈ హౌస్‌కు చివరి కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. అయితే ఈ టాస్కులో బిందు మాధవి, అషు రెడ్డి చాలా త్వరగానే ఓడిపోయారు. ఉత్కంఠతో సాగిన ఈ టాస్కులో నటరాజ్ మాస్టర్ చాలాసార్లు పొరపాటు చేసినా.. అరియనా సంచాలక్ గా ఆయనకి చాలా అవకాశాలు ఇచ్చింది. కానీ నటరాజ్ కూడా ఈ బ్రిక్స్ ఛాలెంజ్ లో చేతులెత్తెయ్యడంతో బాబా భాస్కర్ చివరి కెప్టెన్ కాగా.. మిత్ర శర్మ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఇక నటరాజ్ మాస్టర్ కిల్లర్ గా గెలిచి.. కెప్టెన్సీ టాస్క్ లో ఓడిపోవడంతో.. ఆయన గుక్కపట్టి వెక్కి వెక్కి ఏడ్చేశాడు. అయితే బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫస్ట్ కెప్టెన్ గా తేజు నిలవగా.. చివరి కెప్టెన్ గా బాబా భాస్కర్ నిలిచారు.