కరోనా పాండమిక్ సిట్యువేషన్ ముగిసింది.. వరసగా పాన్ ఇండియా మూవీస్, భారీ బడ్జెట్ మూవీస్ రిలీజ్ లు మొదలవడమే కాదు.. ఇప్పటికే భీమ్లా నాయక్, రాధే శ్యామ్, ట్రిపుల్ ఆర్, కెజిఎఫ్ లాంటి చిత్రాలు బాక్సాఫీసు మీదకి దూసుకొచ్చాయి. రెండు నెలల్లో మూడు బ్లాక్ బస్టర్ మూవీస్, 100 ల కోట్ల కలెక్షన్స్ రావడంతో ఆడియన్స్ హ్యాపీ గానే ఉన్నారు. అయితే ఈ సినిమాల రిలీజ్ ల ముందు అటు బుక్ మై షో లో కానీ, ఇటు ఆడియన్స్ లో కానీ విపరీతమైన క్రేజ్, విపరీతమైన ఆసక్తిని చూసారు. కానీ రేపు అంటే మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతున్న ఆచార్య విషయంలో ఎందుకో అంతటి బజ్ కానీ, అంతటి ఆత్రుత కానీ ఆడియన్స్ లో కనిపించడం లేదు.
ఈమధ్యన ప్రేక్షకులు ఓ నెల ఆగితే సినిమాలు ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. సో థియేటర్స్ కి వెళ్లి అధిక ధరలతో సినిమా టికెట్స్ కొనుక్కుని సినిమా చూసే ఇంట్రెస్ట్ కూడా ఫ్యామిలీ ఆడియెన్సులో తగ్గడం, మూడు సినిమాలు పెద్ద సినిమాలు చూసాం, ఈ కలెక్షన్స్ మోత రోజూ వింటున్నాం, మరోపక్క ఏపీలో 10 వ తరగతి ఎగ్జామ్స్ స్టార్ట్ కావడం, అలాగే ఇంటర్ ఎగ్జామ్స్ ఫీవర్ లో ఉండడం లాంటి కారణాలతో ఆచార్య అడ్వాన్స్ బుకింగ్ కూడా నత్తనడకనే సాగుతుంది. ఇక ఆడియన్స్ కూడా ఆచార్య మీద ఎందుకో అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు..
కొంతమంది ఫ్రెండ్స్ మాట్లాడుకునే మాటలు ఏమిటంటే.. ఆచార్య సినిమా వస్తుంది అంటే ఎలా ఉండాలి బాస్.. కానీ ఈ సినిమాలో రామ్ చరణ్ ఉన్నా ఎందుకో చూసే ఇంట్రెస్ట్ రావడం లేదు, టికెట్ ప్రైజ్ ఒకటి బాస్ అంత ఎక్కువ రేట్స్ పెట్టి సినిమాకి వెళ్ళబుద్ధి కావడం లేదు, నిన్నటివరకు అంతొచ్చింది, ఇన్ని వందల కోట్లు వచ్చాయ్ కలెక్షన్స్ అనే న్యూస్ నుండి ఇంకా బయటపడనే లేదు.. అప్పుడే ఆచార్య వచ్చేస్తుంది.. అంటూ మాట్లాడుకుంటున్నారు.