మెగాస్టార్ - మెగా పవర్ స్టార్ కలిసి నటించిన సినిమా అంటే మెగా ఫాన్స్ లోనే కాదు సాధారణ ఆడియన్స్ లోను విపరీతమైన క్యూరియాసిటీ, క్రేజ్ ఉంటాయి. చిరు - చరణ్ కలిసి సినిమా ని ఏ స్థాయిలో నిలబెడతారా అనే ఆత్రుత మొదలయ్యేలా చేసారు కొరటాల శివ. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొరటాల శివ ఆచార్య ని కూడా అదే విధంగా సక్సెస్ తీరానికి చేరుస్తారని నమ్ముతున్నారు. ఇక నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఆచార్య మూవీ కి సంబందించిన టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యుఎస్ లో ఇప్పటికే ఆచార్య ప్రీమియర్స్ పూర్తికావడంతో.. ఆడియన్స్ ఉండబట్టలేక తమ ఒపీనియన్ ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
ఆచార్య లోకి అడుగుపెడితే.. సూపర్ మహేష్ వాయిస్ ఓవర్ తో ఆచార్య మొదలవుతుంది. తర్వాత సోను సూద్ - చిరు ఫైట్ సీన్ మెగా ఫాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేవిలా ఉన్నాయని, చిరు ఇంట్రో సీన్ సింపుల్ గా ఉన్నా.. చాలా పవర్ ఫుల్ గా ఉంది అంటున్నారు. ఇక సిద్ధ గా చరణ్ ఎంట్రీ ఇంటర్వెల్ కి ముందు ఉంటుంది అని.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ప్రారంభంతో ఫస్టాఫ్ ముగిసి.. సెకండ్ హాఫ్ సిద్ద ఎంట్రీతో మొలువుతుందట. సెకండాఫ్‌లో తండ్రీకొడుకులు రామ్ చరణ్, చిరంజీవి కలయికలో వచ్చే సీన్స్ పూనకాలు తెప్పించాయని అంటున్నారు. ముఖ్యంగా చరణ్ సిద్ద రోల్ ఈ సినిమాకు ప్రాణం అని.. ఇంటర్వెల్ సీన్‌లో సిద్ద ఇరగదీశాడని చెబుతున్నారు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉందని.. పవర్‌ఫుల్ డైలాగ్స్, చిరంజీవి యాటిట్యూడ్, స్క్రీన్ ప్రజెన్స్ అద్బుతంగా ఉంది సినిమా సూపర్ హిట్ అని కొందరు అంటుంటే..
మరికొందరు ఫస్టాఫ్ అంతా సాగదీతగా ఉందని, క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్ కాస్త పర్వాలేదని, కొరటాల శివ నుంచి ఈ తరహా స్క్రిప్ట్ ఊహించలేదని, ఆచార్య స్టోరీ చాలా వీక్‌గా ఉందని.. కొరటాల గత చిత్రాలతో ఏమాత్రం పోల్చే విధంగా ఈ సినిమా లేదనే టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. దీనిని బట్టి ఆచార్య ఓవర్సీస్ ప్రేక్షకులు మిక్స్డ్ టాక్ ని ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఫైనల్ గా క్రిటిక్స్ ఇచ్చే రివ్యూస్ చూస్తే ఆచార్య కెపాసిటీ ఏమిటనేది తేలిపోతుంది.