Advertisementt

బిగ్ బాస్: బిందు ఫాదర్ అఖిల్ ని పొగిడారు

Sun 01st May 2022 09:14 AM
bigg boss non stop,bigg boss,bigg boss ott,bindu madhavi,akhil sarthak  బిగ్ బాస్: బిందు ఫాదర్ అఖిల్ ని పొగిడారు
Bigg Boss Non Stop: Bindu Madhavi Father About Akhil Sarthak బిగ్ బాస్: బిందు ఫాదర్ అఖిల్ ని పొగిడారు
Advertisement
Ads by CJ

ప్రస్తుతం బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఫ్యామిలీ మెంబెర్స్ రాక తో ఇంటి సభ్యులు కాస్త ఎమోషనల్ అవుతున్నారు. అయితే గతంలోలా మరీ ఏడ్చేసి సీన్ చెయ్యడం లేదు.. కాస్త సరదాగానే ఉంది ఈ ఫ్యామిలీ ఎపిసోడ్. అఖిల్ మదర్ వచ్చారు బిందు హగ్ చేసుకుని మరీ అవాయిడ్ చేసారు. శివ సిస్టర్ ఆశుతో జాగ్రత్తగా ఉండమంది. నటరాజ్ పాప వచ్చింది.. హౌస్ ని సరదాగా మార్చేసింది. అనిల్ సిస్టర్ వచ్చారు నటరాజ్ మాస్టర్ కి క్లాస్ పీకారు. అలాగే ఆశు అంత మంచిది కాదు ఆమెతో జాగ్రత్తగా ఉండు అని అనిల్ కి చెప్పింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో హమీద బ్రదర్, అనిల్ సిస్టర్ రాగా.. బిందు మాధవి ఫాదర్ రావడం హైలెట్ అయ్యింది. అంటే బిందు ఫాదర్ రావడం రావడమే ఆమెకి కేక్ తినిపించడమే కాదు.. హౌస్ మేట్స్ అందరిని తెగ పొగిడారు. అందులో బిందు మాధవిని ఆడపులి అన్న ఆయన అఖిల్ ఆట కళాత్మకంగా వుంది అంటూ పొగిడేశారు.

మరి బిందు మాధవికి - అఖిల్ కి మొదటి వారం తర్వాత నుండి పచ్చగడ్డి వేస్తె భగ్గుమనేలా ఉంటుంది వ్యవహారం. బిందు మాధవి ఏం అన్నా అఖిల్ తీసుకోడు. అఖిల్ తో ఎప్పుడూ ఫైట్ కోసం సిద్ధంగా ఉంటుంది బిందు. అలా కూతురితో గొడవ పడుతున్న అఖిల్ ని బిందు మాధవి తండ్రి పొగడడం నిన్నరాత్రి ఎపిసోడ్ లో హైలెట్ అయ్యింది. అలాగే శివ - బిందు ఫ్రెండ్ షిప్ బావుంది అన్నారాయన. ఇక బిందు మాధవి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆడపులి బిందు మాధవి అంటూ ఆమె ఫాన్స్ ట్విట్టర్ లో నేషనల్ వైడ్ గా ట్రెండ్ చేస్తూ హంగామా చేస్తున్నారు. 

Bigg Boss Non Stop: Bindu Madhavi Father About Akhil Sarthak:

Bigg Boss OTT: Yesterday Episode Highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ