Advertisementt

షణ్ముఖ్ కి అదిరిపోయే పంచ్ వేసిన నాగార్జున

Sun 01st May 2022 01:04 PM
bigg boss,bigg boss non stop,shanmukh,nagarjuna,siri,ariyana,sohel  షణ్ముఖ్ కి అదిరిపోయే పంచ్ వేసిన నాగార్జున
Nagarjuna satirical punch on Shanmukh షణ్ముఖ్ కి అదిరిపోయే పంచ్ వేసిన నాగార్జున
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రస్తుతం ఫ్యామిలీ ఎపిసోడ్ తో కాస్త ఎమోషనల్ గాను, హౌస్ మేట్స్ చేసే ఫన్ తో కాస్త ఎంటర్టైన్మెంట్ గాను కనిపిస్తుంది. మరో మూడు వారాల్లో బిగ్ బాస్ నాన్ స్టాప్ ముగియబోతుంది. గత మూడు రోజులుగా హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబెర్స్ తో బిగ్ బాస్ హౌస్ కళకళలాడింది. ఇక ఈ రోజు ఆదివారం. సండే ఫన్ డే అంటూ నాగార్జున హౌస్ మేట్స్ ఫ్రెండ్స్ ని తీసుకుని స్టేజ్ పైకి వచ్చేసారు. బిగ్ బాస్ పాత కంటెస్టెంట్స్ ని నాగార్జున ఈ రోజు బిగ్ బాస్ స్టేజ్ పైకి తీసుకు వచ్చారు. సోహెల్ అఖిల్ కోసం వచ్చాడు. హంగామా చేసాడు. సర్ ఈ సీజన్ లో లవ్ ట్రాక్స్ లేవు అనగానే నువ్ వెళ్ళు సోహెల్ అన్నారు నాగ్.. పంపియ్యండి సర్ అన్నాడు సోహెల్.. ఇంకా మూడు వారాలు కథ నడుపుతా అన్నాడు.

తర్వాత టివి 9 దేవి, అలాగే అరియనా సిస్టర్, యాంకర్ శివ కోసం గత సీజన్ రన్నర్ షణ్ముఖ్ రావడం హైలెట్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 5 తర్వాత పెద్దగా బయటికి కనిపించని షణ్ముఖ్ ఈ రోజు మళ్లీ బిగ్ బాస్ స్టేజ్ పై కనిపించాడు. దానితో నాగ్ ఏమిటి షణ్ముఖ్ కనిపించడం లేదు అంటే.. కొద్దిగా బిజీ అయ్యాను సర్ అన్నాడు. దానికి నాగ్ అదిరిపోయే పంచ్ వేసాడు. ఏమిటి దీప్తి తో బ్రేకప్ బిజీలో ఉన్నావా అనగానే షణ్ముఖ్ సార్ అన్నాడు. ఇక ఆశు దీప్తి ఏం చేస్తుంది షన్ను అనగానే నోటి దూల ఆశు కి అన్నాడు షణ్ముఖ్. తర్వాత సిరి కూడా మిత్ర ఫ్రెండ్ గా వచ్చింది. నాగార్జున ఓల్డ్ హౌస్ మేట్స్ తో ఫన్ చేయించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Nagarjuna satirical punch on Shanmukh:

Bigg Boss Non Stop: latest promo viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ