Advertisementt

అనుష్క కోసం ట్రై చేస్తున్నారట నిజమేనా

Mon 02nd May 2022 05:19 PM
anushka shetty,prabhas,maruthi project,prabhas - maruthi combo  అనుష్క కోసం ట్రై చేస్తున్నారట నిజమేనా
Prabhas And Anushka Together Again? అనుష్క కోసం ట్రై చేస్తున్నారట నిజమేనా
Advertisement
Ads by CJ

అనుష్క బాహుబలి తర్వాత భాగమతి, నిశ్శబ్దం అంటూ మాయమైంది. బరువు తగ్గేందుకు నానా తంటాలు పడిన అనుష్క మళ్ళీ ఇన్నాళ్ళకి నవీన్ పోలిశెట్టి తో సినిమా చేయబోతుంది. అదలా ఉంటే.. టాలీవుడ్ లో ప్రభాస్ - అనుష్క పెయిర్ కి 100 కి 100 శాతం మార్కులు వేసేంత అద్భుతమైన, అందమైన జంట. మిర్చి, బాహుబలి లాంటి చిత్రాలతో వారిద్దరూ టాప్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. వీరి మధ్యన ప్రేమ కూడా ఉందనే పుకార్లు షికార్లు కూడా చేసాయి.

అయితే ఇప్పుడు అనుష్క మరోసారి ప్రభాస్ తో నటించే అవకాశం ఉంది అంటున్నారు. మారుతీ - ప్రభాస్ ప్రోజెక్ట్ లో మూగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ రొమాన్స్ చేస్తాడని అందులో రాశి ఖన్నా, శ్రీలీల ఇప్పటికే ఫైనల్ అని తెలుస్తుంది. ఇప్పుడు మూడో హీరోయిన్ గా అనుష్క కోసం మారుతీ ట్రై చేస్తున్నట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మరి అనుష్క మరోసారి ప్రభాస్ తో జోడి కడితే ఆ క్రేజే వేరబ్బా.. అంటున్నారు ప్రభాస్ ఫాన్స్. చూద్దాం మారుతి ప్రాజెక్ట్ లోకి అనుష్క వస్తుందో.. లేదో.. అనేది.

Prabhas And Anushka Together Again?:

Will Anushka Shetty romance Prabhas again in his Maruthi project

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ