Advertisementt

బిగ్ బాస్: ఈ వారం నామినేషన్స్ లిస్ట్

Mon 02nd May 2022 10:15 PM
bigg boss non stop,bigg boss,bindu,akhil,anchor shiva,ashu reddy,ariyana,mitraa,anil  బిగ్ బాస్: ఈ  వారం నామినేషన్స్ లిస్ట్
Bigg Boss Nonstop: 10th Week nominations బిగ్ బాస్: ఈ వారం నామినేషన్స్ లిస్ట్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ చివరి దశకు చేరుకుంది. గత వారమంతా ఫ్యామిలీ మెంబెర్స్ రాకతో హౌస్ మేట్స్ మొహాలు కళకళలాడాయి. అంతేకాకుండా ఆదివారం నాగార్జున ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ ఫ్రెండ్స్ వచ్చారు. ఓల్డ్ హౌస్ మేట్స్ ఈ కొత్త ఇంటి సభ్యుల కోసం వచ్చారు. సోహెల్, సిరి, రాహుల్ సిప్లిగంజ్, షణ్ముఖ్ ఇలా పాత వాళ్ళు వచ్చారు కామెడీ చేసారు. ఇక కొంతమంది హౌస్ మేట్స్ తల్లితండ్రుల్ని కూడా పిలిపించారు నాగ్. అంతా హ్యాపీ. కానీ ఈ వారం నామినేషన్స్ విషయం మళ్ళీ వేడి రాజుకుంది. రసాభాసా అయ్యింది. అరియనా - అఖిల్ మధ్యలో పెద్ద గొడవే జరిగింది. బిందు మాధవి - మిత్ర శర్మ మధ్యలో ఫైట్ జరగగా.. బిందు మాధవి మిత్ర శర్మని ఎగతాళి చేసింది.

మిత్ర శర్మ నామినేషన్స్ అప్పుడు, బిందు నామినేషన్స్ అప్పుడు మిత్రని మాట్లాడకుండా బిందు డ్రామా చేసింది. అరియనా విమెన్ టైటిల్ విన్నర్ అయితే బావుంటుంది అన్న విషయం అఖిల్ కి నచ్ఛలేదు. ఇక ఓవరాల్ లేడీస్ అంతా యాంకర్ శివ ని నామినేట్ చేసారు. కారణం ఆశు రెడ్డి వీడియో. అనిల్ ని నటరాజ్ నామినేట్ చేసాడు. అలాగే ఆశు రెడ్డిని కూడా ఎక్కువగా నామినేట్ చేసారు. ఫైనల్ గా ఈవారం నటరాజ్ మాస్టర్, అండ్ కెప్టెన్ బాబా భాస్కర్ తప్ప హౌస్ లోని ఉన్న అఖిల్, శివ, అరియనా, మిత్ర, బిందు, ఆశు రెడ్డి, అనిల్ అందరూ నామినేషన్స్ లోకి వెళ్లారు. మరి నిన్నటి వారం హమీదా ఎలిమినేట్ అవగ్గా.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే ఆసక్తి బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రేక్షకుల్లో ఉంది. 

Bigg Boss Nonstop: 10th Week nominations:

Bigg Boss Non Stop: 10th Week Voting Results Nominations List

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ