Advertisementt

మహేష్ కి సారి చెప్పిన కీర్తి సురేష్

Tue 03rd May 2022 05:41 PM
keerthy suresh,mahesh babu,sarkaru vaari paata,keerthy suresh interview  మహేష్ కి సారి చెప్పిన కీర్తి సురేష్
Keerthy Suresh shares funny incident with Mahesh Babu మహేష్ కి సారి చెప్పిన కీర్తి సురేష్
Advertisement
Ads by CJ

సర్కారు వారి పాట ప్రస్తుతం ప్రమోషన్స్ జోరులో ఉంది. సర్కారు వారి పాట నుండి టెక్నీకల్ టీం రోజుకొకరు ఇంటర్వూస్ ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. మరోపక్క హీరోయిన్ కీర్తి సురేష్ ఇంటర్వూస్ ఇస్తూ సర్కారు వారి పాట ముచ్చట్లు మీడియా తో పంచుకుంటుంది. కళావతి సాంగ్ తో టాప్ లేపిన కీర్తి సురేష్ లుక్స్ విషయంలో మహేష్ ఫాన్స్ ఆందోళనలో ఉన్నా.. ఆ సినిమా ట్రైలర్ లో కీర్తి సురేష్ ని చూసి కూల్ అయ్యారు. అయితే తాజాగా కీర్తి సురేష్ మహేష్ కి సారి చెప్పాను అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. 

అంటే మహేష్ ని మూడుసార్లు కొట్టి మరీ కళావతి మహేష్ కి సారి చెప్పిందట. అసలు విషయం ఏమిటి అంటే.. మహేష్ అంటే సరదాగా ఉంటారు కదా.. మిమ్మల్ని షూటింగ్ స్పాట్ లో ఏమైనా టీజ్ చేసారా అని యాంకర్ కీర్తి సురేష్ ని అడిగితే.. మహేష్ గారితో షూటింగ్ చెయ్యడం అంటే చాలా ఫన్నీగా ఉంటుంది. ఓ సాంగ్ టైం లో నేను టైమింగ్ మరిచిపోయి, డాన్స్ స్టెప్స్ కూడా మరిచిపోయాను. ఆ సమయంలోనే మహేష్ మొహం పై రెండుసార్లు కొట్టేసాను. అప్పుడు సారి చెప్పాను. తర్వాత మూడోసారి కూడా మిస్టేక్ జరిగింది. ఆ టైం లో నాకు చాలా భయం వేసింది. దానితో మహేష్ నా మీద ఏమైనా పగ పెట్టుకున్నావా అంటూ ఫన్ చేసారు అంటూ కీర్తి సురేష్ సర్కారు వారి పాట సెట్స్ లో జరిగిన ఫన్నీ మూమెంట్స్ ని ఆ ఇంటర్వ్యూలో పంచుకుంది.

Keerthy Suresh shares funny incident with Mahesh Babu:

Keerthy Suresh Shares A Hilarious Incident With Mahesh Babu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ