Advertisementt

బిగ్ బాస్: బిందు గ్రాఫ్ పడిపోతుందా?

Tue 03rd May 2022 08:02 PM
bigg boss non stop,bigg boss,eliminate bindu madhavi hash tag,twitter,social media,bindu madhavi  బిగ్ బాస్: బిందు గ్రాఫ్ పడిపోతుందా?
EliminateBinduMadhavi trends on twitter బిగ్ బాస్: బిందు గ్రాఫ్ పడిపోతుందా?
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నాన్ స్టాప్ లో మొదట్లో పెద్ద గా విషయంలో లేని హీరోయిన్ బిందు మాధవి తర్వాత రెండు వారాలకే టైటిల్ ఫెవరెట్ గా మారడమే కాదు, మరో టైటిల్ ఫెవరెట్ అఖిల్ కి టఫ్ ఫైట్ ఇస్తూ వస్తుంది. సివంగి, ఆడపులి లా, సింహం సింగిల్ గా వస్తుంది.. విమెన్ పవర్ చూపిస్తా అంటూ అఖిల్ తో ఫైట్ చేస్తుంది. నామినేషన్స్ విషయంలోనూ బిందు మాధవి చాలా స్ట్రాంగ్ గానే డెసిషన్స్ తీసుకుంది. అయితే మొదటి నుండి మరో కంటెస్టెంట్ మిత్ర శర్మకి బిందు మాధవికి పడేది కాదు. మిత్ర శర్మ గత నామినేషన్స్ లో బిందు మాధవిని పిచ్చి బిహేవియర్ తో చాలాసార్లు ఇబ్బంది పెట్టి నామినేట్ చేసింది. మిత్ర శర్మ బిహేవియర్ కి హౌస్ మేట్స్ కూడా ఆమెకి వార్నింగ్ ఇచ్చారు.

అయితే రీసెంట్ నామినేషన్స్ లో బిందు మాధవి మిత్ర శర్మని నామినేట్ చేసింది. మిత్రని ఇమిటేట్ చేస్తూ.. కాస్త చిరాకు తెప్పించేలా బిందు ఆమెని నామినేట్ చేసింది. మిత్ర శర్మ డీ ఫేమ్ చేస్తుంది అంటూ ఆమెని మాటలతో కాకుండా రకరకాల చేష్టలతో ఉడికించింది. అయినా మిత్ర శర్మ మాత్రం చాలా కంట్రోల్ గా ఉండిపోయింది. ఈ నామినేషన్స్ లో బిందు మాధవి మిత్రలా, మిత్ర బిందులా బిహేవ్ చేసారు. అయితే గత రాత్రి నామినేషన్స్ లో బిందు చేసిన పని ఆమె ఫాన్స్ కి కూడా నచ్చడం లేదు. దానితో ఆమె యాంటీ ఫాన్స్ బిందు మాధవి చేసిన వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తూ.. #EliminateBinduMadhavi హ్యాష్ ట్యాగ్‌ను నేషనల్ వైడ్ గా ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. అటు #BinduMadhavi హాష్ టాగ్, ఇటు #EliminateBinduMadhavi హాష్ టాగ్స్ రెండూ ట్రెండ్ అవుతున్నాయి. 

EliminateBinduMadhavi trends on twitter:

Bigg Boss NonStop: Eliminate Bindu Madhavi trends on twitter

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ