ఇప్పుడు ఏ భాషలో చూసినా రష్మిక మందన్న పేరే వినిపిస్తుంది. పుష్ప పాన్ ఇండియా మూవీ తో రష్మిక క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అందుకే కోలీవుడ్ విజయ్ సినిమా, అటు బాలీవుడ్ రణబీర్ కపూర్ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. తెలుగు, తమిళ, మళయాలం, హిందీ అబ్బో అమ్మడు ఎవరికీ దొరకనంతగా పరుగులు పెడుతుంది. అయితే రష్మిక తెలుగులో పుష్ప 2 పాన్ ఇండియా మూవీ చేస్తుండగా.. తమిళంలో విజయ్ తో మరో పాన్ ఇండియా మూవీ చేస్తుంది. అలాగే బాలీవుడ్ లోను పలు ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతుంది రష్మిక.
అయితే మలయాళంలో రష్మిక హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న సీతా రామమ్ లో దుల్కర్ సల్మాన్ కి జోడిగా కాకుండా ముస్లిం యువతిగా కనిపించబోతుంది. అయితే రష్మిక ఫ్యామిలీ మ్యాన్ లో సమంత కేరెక్టర్ ని చూసి ఇంప్రెస్స్ అయ్యి ఆ సినిమాలో అలాంటి గెటప్ లో నటిస్తుంది అనుకున్నారు. అంతేకాకుండా సీతా రామమ్ లో రష్మిక హీరోయిన్ అనుకుంటున్నారు. కానీ దర్శకుడు హను రాఘవపూడి మాత్రం ఈ సినిమాలో రశ్మిక్ హీరోయిన్ కాదు హీరో అనేస్తున్నారు. ఒక కీలకమైన పాత్రలో రష్మిక అఫ్రీన్ అనే కశ్మీర్ ముస్లిమ్ అమ్మాయిగా ఆమె కనిపిస్తుంది. ఆ పాత్రకి పెద్దగా డైలాగ్స్ ఉండవు. జస్ట్ కళ్లతోనే హావభావాలను పలికిస్తుంది.. అంటూ రష్మిక పాత్రపై హను రాఘవపూడి అంచనాలు పెంచేశారు.