Advertisementt

బిగ్ బాస్: ఈ వారం డేంజర్ జోన్ లో..

Wed 04th May 2022 10:32 AM
bigg boss non stop,bigg boss,ashu reddy,anil,danger zone  బిగ్ బాస్: ఈ వారం డేంజర్ జోన్ లో..
Bigg Boss Non Stop: 2 contestants in danger zone బిగ్ బాస్: ఈ వారం డేంజర్ జోన్ లో..
Advertisement
Ads by CJ

ఈ వారం బిగ్ బాస్ నాన్ స్టాప్ లో బాబా భాస్కర్, నటరాజ్ మాస్టర్ తప్ప హౌస్ లో ఉన్నప్రతి ఒక్కరూ నామినేషన్స్ లోకి వెళ్లారు. అందులో అఖిల్, బిందు మాధవి, యాంకర్ శివ, అనిల్, ఆశు, అరియనా, మిత్ర శర్మ ఉన్నారు. గత వారం హమీద ఎలిమినేట్ అవ్వగా.. చివరి మూడు వారాల్లో ఎలిమినేట్ అయ్యి ఎవరు హౌస్ ని వీడతారు, ఎవరు టాప్ 5 కి వెళతారు అనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఎప్పుడో ఎలిమినేట్ అవుతుంది అనుకున్న మిత్ర శర్మ పదో వారం వరకు హౌస్ లో నిలబడడం పై చాలామంది షాక్ అయినా.. ఆమె చివరి వారాల్లో కాస్త స్ట్రాంగ్ ప్లేయర్ గా తయారైంది.

ఇక మొదటి వారం నుండే ఓటింగ్ విషయంలో అఖిల్ కి పోటీ ఇస్తున్న బిందు మాధవికి ఈ నామినేషన్స్ హీట్ తగిలింది. అంటే మిత్ర శర్మ ని ఇమిటేట్ చేస్తూ బిందు చేసిన రచ్చ వలన ఆమెకి ఓటింగ్ లో షాక్ తగిలింది. దానితో అఖిల్ ఫస్ట్ ప్లేస్ ని ఆక్రమించగా, బిందు మాధవి సెకండ్ ప్లేస్ లో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత మూడో ప్లేస్ లో యాంకర్ శివ ఉండగా మిత్రా శర్మ నాలుగో స్థానంలోనూ, ఆరియానా ఐదో స్థానంలోనూ ఉన్నారని తెలుస్తుంది. ఇక చివరి స్థానాలు, డేంజర్ జోన్ లో ఆశు రెడ్డి, అనిల్ ఉన్నారట. అనిల్ ఆరో స్థానంలో, ఆశు ఏడో స్థానంలో ఉన్నారని, ఉంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు అని, అలా వీరిద్దరూ హౌస్ ని వీడొచ్చని, లేదంటే అనిల్, ఆశు లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వొచ్చని అంటున్నారు.

Bigg Boss Non Stop: 2 contestants in danger zone:

Bigg Boss Non Stop: Ashu and Anil in danger zone

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ