అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప ద రైజ్ పాన్ ఇండియా మార్కెట్ ని దడలాడించింది. హిందీలో కళ్ళు చెదిరే కలెక్షన్స్ తో అందరూ కుళ్ళుకునేలా చేసింది. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ హీరోయిజం బాగా హైలెట్ అవడమే కాదు, పుష్ప సినిమాలో సాంగ్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. దానితో పుష్ప ద రూల్ పై అంచనాలు ఆకాశంలోకి ఎక్కేశాయి. జూన్ నుండి పుష్ప ద రూల్ షూటింగ్ ని మొదలు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఈసారి అల్లు అర్జున్ - ఫహద్ ఫాజిల్ మధ్యలో హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారట సుకుమార్, యాక్షన్ ప్యాకెడ్ మూవీస్ కి పాన్ ఇండియాలో ఉండే క్రేజ్ పుష్ప తోనూ, ఇటు ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్ చాప్టర్ 2 ప్రత్యక్షంగా చూసిన సుకుమార్.. ఈసారి పుష్ప ద రూల్ కి ఆ యాక్షన్ ఫార్ములానే అప్లై చేయబోతున్నారట. అందుకే అల్లు అర్జున్ - ఫహద్ కి మధ్యలో హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ని హాలీ వుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారని వినికిడి. అయితే ఇప్పుడు పుష్ప పై ఎలాంటి అప్ డేట్ లేకపోయినా.. పుష్ప ద రూల్ ఇంట్రెసింగ్ న్యూస్ లతోనే సోషల్ మీడియాలో అనూహ్యంగా ట్రెండింగ్ లోకి వచ్చింది.