Advertisementt

RC15: రామ్ చరణ్ పవర్ ఫుల్ లుక్ లీక్

Thu 05th May 2022 01:52 PM
rc15,ram charan,rc 15 update,shankar,kiara advani,dilr aju  RC15: రామ్ చరణ్ పవర్ ఫుల్ లుక్ లీక్
RC15: Ram Charan Powerful Look Leak RC15: రామ్ చరణ్ పవర్ ఫుల్ లుక్ లీక్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ లో బ్రిటిష్ పోలీస్ గాను, అలాగే అల్లూరి సీతారామరాజుగా పవర్ ఫుల్ లుక్ లో కనిపించి మెగా ఫాన్స్ కి ట్రీట్ ఇచ్చారు. అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన ఆచార్య లోను సిద్ద గా రామ్ చరణ్ లుక్ మెగా ఫాన్స్ ని ఇంప్రెస్స్ చేసింది. ఇక శంకర్ సినిమాలో రామ్ చరణ్ ఎలాంటి కేరెక్టర్ లో కనిపించబోతున్నారనే క్యూరియాసిటిలో మెగా ఫాన్స్ ఉన్నారు. మొన్నామధ్యన RC15 షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నప్పుడు రామ్ చరణ్ వైట్ అండ్ వైట్ లుంగీ లో సైకిల్ మీద వెళుతున్న లుక్ లీకై సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇక తాజాగా RC15 లేటెస్ట్ షెడ్యూల్ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో మొదలైంది. నిన్ననే రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీ వైజాగ్ వెళ్లారు. రామ్ చరణ్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లగానే ఆయన ఫాన్స్ చేసిన రచ్చ కూడా మీడియాలో హైలెట్ అయ్యింది. అయితే వైజాగ్ బీచ్ లో దర్శకుడు శంకర్.. చరణ్ పై ఇంకా సినిమాలోని విలన్స్ పై ఓ అద్భుతమైన పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు. అక్కడ 

సెట్స్ లో రామ్ చరణ్ స్టూడెంట్ గా పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్నాడు. అలాగే RC15 యాక్షన్స్ సీక్వెన్స్ కోసం ఓ స్పెషల్ బైక్ ని రెడీ చేస్తున్న దృశ్యాలు, రామ్ చరణ్ మాసివ్ లుక్ లీకై ఇప్పడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అభిమానుల ఉత్సాహం ఇలాంటి లీకులకి తావిస్తుంది. 

RC15: Ram Charan Powerful Look Leak:

RC15 update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ