Advertisementt

సుధీర్ అన్నా ఢీ షో ఎందుకు మానేశావ్

Thu 05th May 2022 04:22 PM
sudheer,dhee dance show,sridevi drama company show,sridevi drama company comedy show  సుధీర్ అన్నా ఢీ షో ఎందుకు మానేశావ్
Sridevi Drama Company New promo viral సుధీర్ అన్నా ఢీ షో ఎందుకు మానేశావ్
Advertisement
Ads by CJ

ఇది ఎప్పటినుండో సుధీర్ అభిమానులు అడుగుతున్నారు. సుధీర్ అన్న ఢీ ఎందుకు మానేసాడు అని, గత కొన్ని సీజన్స్ నుండి రష్మీ తో కలిసి సుధీర్ ఢీ డాన్స్ షో లో చాలా ఎంటర్టైన్ చేసేవాడు. గత సీజన్ లో సుధీర్, ఆది, రష్మిక, దీపికా పిల్లి తో కలిసి యాంకర్ ప్రదీప్ ఢీ డాన్స్ షో ని కామెడీ ఎంటర్టైనర్ గా మార్చేశారు, ఢీ లో కేవలం డాన్స్ మాత్రమే కాదు, ఫన్ కూడా ఉంటుంది అని చూపించారు. అయితే అంతగా ఢీ లో చొచ్చుకుపోయిన సుధీర్ ఈ సీజన్ లో సడన్ గా కనిపించకుండా పోయాడు. అటు రష్మీ కూడా ఢీ డాన్స్ షో లో లో కనిపించలేదు.

ఆది, బిగ్ బాస్ అఖిల్ లాంటి వాళ్ళు మాత్రమే ఢీ డాన్స్ లో కనిపిస్తున్నారు. అయితే అప్పటినుండి ఇప్పటివరకు సుధీర్ ఢీ డాన్స్ షో లో ఎందుకు మిస్ అయ్యాడో అర్ధం కాక అయోమయంలో ఉన్నారు సుధీర్ ఫాన్స్. అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఈ ఆదివారం అ..ఆ, అమ్మాయిలు vs ఆంటీస్ అంటూ రాబోతున్న ప్రోగ్రాంలో సుధీర్ ని ఓ అభిమాని వీడియో ద్వారా సుధీర్ అన్నా నువ్వు ఢీ ఎందుకు మానేశావ్ అంటూ ప్రశ్న వేసాడు. అయితే అన్నీ ప్రశ్నలకు ఈ ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీలో తెలుస్తాయని చెప్పాడు సుధీర్. ఇక పంచ్ ప్రసాద్ ని కూడా ఓ ఫాన్.. అన్నా మీ హెల్త్ కి ఏమైనా అయితే నేను ఉన్నాను.. నా కిడ్నీ మీకు ఇచ్చి బ్రతికించుకుంటాను అన్న వీడియో చూసిన పంచ్ ప్రసాద్ ఎమోషనల్ గా నాకు ప్రాణాలు ఇచ్చేంత అభిమానులు ఉన్నారా నిజంగా ఇది నా అదృష్టం అంటూ సుధీర్ ని పట్టుకుని ఏడ్చేసిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Sridevi Drama Company New promo viral:

Sridevi Drama Company comedy show

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ