ట్రిపుల్ ఆర్ మూవీ లో ఎన్టీఆర్ తో కలిసి రచ్చ రచ్చ చేసిన రామ్ చరణ్.. సిద్ధగా ఆచార్య లో మెప్పించినా.. ఆ సినిమా లో బలం లేకపోవడంతో.. ఆ సినిమా కి నెగెటివ్ టాక్ వచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్ శంకర్ తో చేస్తున్న RC15 కోసం చిన్న పాటి గ్యాప్ కానీ, చిన్నపాటి వెకేషన్స్ కి వెళ్లకుండా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం RC15 షూటింగ్ వైజాగ్ బీచ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. అయితే RC 15 షూటింగ్ స్పాట్ నుండి రామ్ చరణ్ స్టూడెంట్ లుక్ ఫొటోస్ మాత్రమే కాదు, ఓ వీడియో కూడా లీకైంది.
ఆ RC15 లీకెడ్ వీడియో లో రామ్ చరణ్ స్టూడెంట్ గా రోడ్ మీద ట్రాఫిక్ పోలీస్ లతో గొడవ పడుతున్న సీన్ ఇప్పుడు వీడియో రూపంలో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. రామ్ చరణ్ షూటింగ్ కోసం వాడిన బైక్ దానికి చలానా రాస్తున్న ట్రాఫిక్ పోలీస్.. ఇలా ఆ సీన్ లో ట్రాఫిక్ పోలీస్ లతో రామ్ చరణ్ కనిపిస్తున్నారు. మరి సినిమాలో క్రేజీగా, హీరోయిజం హైలెట్ అవుతూ, ఫాన్స్ కి కిక్ ఇచ్చే ఇలాంటి సీన్స్ షూటింగ్ స్పాట్ నుండి లీకైతే సినిమాకి డ్యామేజ్ జరగడం ఖాయం. కానీ క్రేజీ ఫాన్స్ మాత్రం చరణ్ ని చూసిన ఉత్సాహంలో ఇలాంటి వీడియోలు షూటింగ్ సెట్స్ లో షూట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కానీ ఈ లీకులు వెంటనే ఆపకపోతే RC15 కి చాలా డ్యామేజ్ జరుగుతుంది.