బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పెట్టిన టాస్క్ లు గత రాత్రితో ముగిసాయి. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం టాస్క్ లు ఆడించడానికి గత సీజన్ లో క్రేజీ హౌస్ మేట్స్ ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపారు. సిరి వచ్చింది, బాబా గెలిచాడు, మానస్ వచ్చాడు అనిల్ గెలిచాడు, తర్వాత యాంకర్ రవి వచ్చాడు బిందు గెలిచింది, నిన్న ఎపిసోడ్ లో షణ్ముఖ్ వచ్చాడు అఖిల్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ కంటెండర్ గా సెలెక్ట్ అయ్యాడు. అయితే ఈ టాస్క్ ల్లో నటరాజ్ గెలిచినా సీక్రెట్ బాక్స్ వలన అనిల్ కంటెండర్ అవ్వగా, తర్వాత వరసగా శివ రెండు సార్లు గెలిస్తే ఒకసారి బిందు తో స్వాప్ చేసుకున్నాడు. తర్వాత ఆ సీక్రెట్ బాక్స్ తనదగ్గర ఉంచుకుని అఖిల్ కంటెండర్ అయ్యాడు.
షణ్ముఖ్ హౌస్ మేట్స్ తో గేమ్స్ ఆడించడమే కాదు, వారు హౌస్ లో ఉన్నప్పుడు హ్యాపీ మూమెంట్, అలాగే రిగ్రెట్ అయిన మూమెంట్ చెప్పమని అడిగాడు. దానితో బిందు తండ్రి వచ్చినప్పుడు హ్యాపీ గా ఉన్నాను. ఎందుకంటే మా నాన్న టాపర్, నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్, ఆయనేం చెప్పినా చెయ్యలేదు, ఆఖరికి పెళ్లి కూడా చేసుకోలేదు. కానీ ఆయన హౌస్ లోకి వచ్చి హాగ్ ఇచ్చి ఆడపులిలా ఆడుతున్నావ్ అన్నప్పుడు బెస్ట్ మూమెంట్ గా ఫీలయ్యాను. ఇక నామినేషన్స్ అప్పుడు అఖిల్ దగ్గర మాట జారాను. అదొక్కటే అంది. ఇక అఖిల్, అరియనా, ఆశు, శివ ఇలా అందరూ చెప్పారు. షణ్ముఖ్ డాన్స్ చేస్తూ హౌస్ మొత్తాన్ని సందడిగా మార్చేసి వెళ్లిపోగా.. అరియనా - శివ లు మాట్లాడుకుంటున్నారు: ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్ లో ఫైనల్ గా అఖిల్ గెలుస్తాడు అంది అరియనా. ఎందుకు ఆలా అంటున్నవ్ అని శివ అడిగితే ఎందుకో అలా అనిపిస్తుంది అంది అరియనా.