కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార - దర్శకుడు విగ్నేష్ శివన్ గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు కానీ.. పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు. అదిగో నయనతార పెళ్లి, ఇదిగో పెళ్లి అనడమే కానీ ఈ జంట పెళ్లి పీటలెక్కడం లేదు. మొన్నామధ్యన నయనతార చెన్నైలోని పోర్ష్ ఏరియాలో ఓ కాస్ట్లీ ఇల్లు కొంది, ఆ ఇంట్లోనే నయనతార వివాహం తర్వాత ఉండబోతుంది అంటూ ప్రచారం జరిగింది. ఇక పుట్టిన రోజు వేడుకలు, క్రిష్టమస్ వేడుకలని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకునే ఈ జంట ఈ మధ్యన పుణ్యక్షేత్రాలు తిరుగుతుంది. తిరుమల శ్రీవారిని, ఆ తర్వాత షిర్డీ సాయి బాబా ని సందర్శించుకున్న నయనతార - విగ్నేష్ లు ఈ యాత్రలు చేసింది పెళ్లి కోసమేనట.
అంటే నయనతార - విగ్నేష్ శివన్ ల పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యింది అని, అలాగే పెళ్లి చేసుకోబోయే ప్లేస్ కూడా కంఫర్మ్ అయినట్లుగా చెబుతున్నారు. నయనతార - విగ్నేష్ శివన్ లు జూన్ 9న, తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లుగా తెలుస్తుంది. అందుకోసమే నయనతార - విగ్నేష్ లు తిరుపతి వచ్చి పెళ్లి వేదిక, తేదీ అన్ని చూపించుకుని వెళ్లారని అంటున్నారు. ఇక రీసెంట్ గా విఘ్నేశ్ దర్శకత్వం వహించిన కాతు వాకుల రెండు కాదల్ చిత్రంలో నయనతార సమంత తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరో. ఏప్రిల్ 28న విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది