Advertisementt

ప్రభాస్ ప్రాజెక్ట్ కె లో మరో బాలీవుడ్ బ్యూటీ

Sun 08th May 2022 11:54 AM
project k,dish patani,prabhas,nag ashwin,deepika apdukone  ప్రభాస్ ప్రాజెక్ట్ కె లో మరో బాలీవుడ్ బ్యూటీ
Disha Patani Is Now Officialy The Part Of Project K ప్రభాస్ ప్రాజెక్ట్ కె లో మరో బాలీవుడ్ బ్యూటీ
Advertisement
Ads by CJ

ప్రభాస్ - నాగ్ అశ్విన్ కలయికలో ఇంటర్నేషనల్ స్టాండెడ్స్ తో తెరకెక్కుతున్న మూవీ ప్రాజెక్ట్ కె(వర్కింగ్ టైటిల్). ఈ మూవీలో ప్రభాస్ సూపర్ మాన్ గా కనిపిస్తారని, ప్రభాస్ రోల్ అత్యంత శక్తివంతంగా ఉండబోతున్నట్లుగా నాగ్ అశ్విన్ క్లూ కూడా ఇచ్చారు. ఇక ప్రాజెక్ట్ కె కోసం నాగ్ అశ్విన్ ఎక్కవగా బాలీవుడ్ నటులనే తీసుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో నాగ్ అశ్విన్ దీపికా పదుకొనేని ఎంపిక చెయ్యడంతో సినిమాపై హిందీలో భారీగా క్రేజ్ పెరిగింది. అంతేకాకుండా అమితా బచ్చన్ లాంటి నటులు ఈ మూవీ లో భాగమయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో లో ప్రభాస్ ప్రాజెక్ట్ కె షూటింగ్ జరుగుతుంది. 

అయితే ప్రాజెక్ట్ కె అనౌన్స్ చేసి అందులో దీపికా హీరోయిన్ గా ఫైనల్ అయినప్పటినుండి ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉండబోతుంది అని ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ప్రాజెక్ట్ కె లో మరో గ్లామర్ హీరోయిన్ కి చోటిచ్చారు. అది కూడా బాలీవుడ్ నుండే. బాలీవుడ్ లో గ్లామర్ రోల్స్ కేరాఫ్ అడ్రెస్స్ అయిన దిశా పటాని ప్రాజెక్ట్ కె లో భాగమైనట్లుగా, ప్రాజెక్ట్ కె లోకి ఆహ్వానం పలుకుతూ దిశా పటానికి బొకే పంపగా.. ఆమె దానిని ఇన్స్టా లో పోస్ట్ చేస్తూ ప్రాజెక్ట్ కె లో భాగమవుతున్నందుకు హ్యాపీ గా ఉంది అంటూ షేర్ చేసింది. దానితో ప్రాజెక్ట్ కె లో దిశా పాటని అఫీషియల్ అయ్యింది.

Disha Patani Is Now Officialy The Part Of Project K:

Project K Welcomes You Onboard Dish Patani

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ