Advertisementt

ఆది పినిశెట్టి-నిక్కీ గల్రాని పెళ్ళి తేదీ ఫిక్స్

Sun 08th May 2022 12:08 PM
aadi pinisetty,nikki galrani,aadi pinisetty - nikki galrani wedding date,aadi pinisetty-nikki galrani wedding reception  ఆది పినిశెట్టి-నిక్కీ గల్రాని పెళ్ళి తేదీ ఫిక్స్
Aadi Pinisetty,Nikki Galrani wedding date revealed ఆది పినిశెట్టి-నిక్కీ గల్రాని పెళ్ళి తేదీ ఫిక్స్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. హీరోయిన్ నిక్కీ గల్రానిని ఆదిపినిశెట్టి ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట మొన్నీమధ్యనే తమ ప్రేమని కన్ఫర్మ్ చేస్తూ ఫ్యామిలీ మెంబెర్స్ మధ్యన ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. నిశ్చితార్ధం ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ప్రేమ బంధం పెళ్లి తో ఏడడుగులు నడవడానికి సిద్దమైనట్లుగా చెప్పారు. ఈ ఎంగేజ్మెంట్ కుటుంబ సభ్యుల మధ్యన సింపుల్ గా జరగగా.. ఈ వేడుకకి టాలీవుడ్ నుండి ఆది ఫ్రెండ్ నాని, అలాగే ప్రముఖ డిజైనర్ నీరజ కోన హాజరయ్యారు.

ఇక తాజాగా ఆది పిన్ని శెట్టి- నిక్కీ గల్రాని పెళ్లి తేదీ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. ఆది పినిశెట్టి వివాహం ఈ నెల 18వ తేదీన చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్‌లో జరుగనుంది. అయితే ఈ పెళ్ళి ఆది కుటుంబ సంప్రదాయం ప్రకారం జరుగనుంది అని, ఆది-నిక్కీ వివాహ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు, దగ్గరి బంధువులు, కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరుకానున్నారు అని తెలుస్తుంది. పెళ్లి తర్వాత చెన్నైలో ప్రముఖ రిసార్ట్స్ లో ఆది - నిక్కీల రిసెప్షన్ నిర్వహిస్తారని, ఈ వేడుకకి టాలీవుడ్ ప్రముఖులు, అలాగే కోలీవుడ్ సినీ ప్రముఖులు హాజరు కానున్నారని చెబుతున్నారు.

Aadi Pinisetty,Nikki Galrani wedding date revealed:

Aadi Pinisetty, Nikki Galrani wedding date fix

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ