Advertisementt

సర్కారు వారి పాట రన్ టైం లాక్

Sun 08th May 2022 01:25 PM
mahesh babu,sarkaru vaari paata,svp run time,svp,parasuram,ghattamaneni fans  సర్కారు వారి పాట రన్ టైం లాక్
SVP run time excites all సర్కారు వారి పాట రన్ టైం లాక్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ వేడుకలు నిన్న రాత్రి హైదరాబాద్ నడిబొడ్డున పోలీస్ గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా జరిగాయి, మహేష్ స్టైలిష్ గా సింపుల్ గా ఈ వేడుకకి హాజరవగా, కీర్తి సురేష్ మోడరన్ సారీ లో గ్లామర్ గా కనిపించింది. అయితే ఈవెంట్ లో మహేష్ ఫస్ట్ ఎమోషన్ అయ్యారు. అభిమానుల కోసమే సినిమా చేస్తాను అని, అంతమంది అభిమానులు దొరకడం ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం అని చెప్పిన మహేష్ బాబు గత ఏడాది తనకి దగ్గరైన వారిని పోగొట్టుకున్నాను అని, ఏది జ‌రిగినా మీ అభిమానం మాత్రం మార‌లేదు. ఇది చాలు.. ధైర్యంగా ముందుకు వెళ్లిపోవటానికి.. అంటూ మహేష్ ఎమోషనల్ గా మాట్లాడారు.

ఇక సర్కారు వారి పాట సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్టు సర్కారు వారి పాటకి యు/ఏ సర్టిఫికెట్ ఇవ్వగా.. ఇప్పుడు రన్ టైం లాక్ చేసింది టీం. 162.25 నిమిషాల రన్ టైం అంటే.. 2 గంటల 42 నిమిషాల 25 సెకన్స్ గా సర్కారు వారి పాట నిడివి ఉండబోతుంది. ఇక మహేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా చాలా బాగా వచ్చింది అని, ఖచ్చితంగా రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారని, మే 12 న థియేటర్స్ లో రచ్చ అంటూ ఫాన్స్ లో ఆయన ఉత్సాహాన్ని నింపారు.

SVP run time excites all:

Sarkaru Vaari Paata run time confirmed officially

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ